హోండా నుంచి సరికొత్త అమేజ్

Wed,April 24, 2019 12:04 AM

Honda Amaze VX CVT launched in India at Rs 8 56 lakh

ప్రారంభ ధర రూ.8.56 లక్షలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కాంప్యాక్ట్ సెడాన్ విభాగంలో లభిస్తున్న అమేజ్‌ను నూతనంగా విడుదల చేసింది హోండా కార్స్ ఇండియా. నూతన గ్రేడ్ వీఎక్స్ సీవీటీ ట్రిమ్ కలిగిన ఈ నూతన మోడల్ పెట్రోల్, డీజిల్ రకాల్లో లభించనున్నది. వీటిలో పెట్రోల్ రకం రూ.8.56 లక్షలకు లభించనుండగా, డీజిల్ ధర రూ.9.56 లక్షలుగా నిర్ణయించింది. రెండో జనరేషన్‌గా విడుదలైన ఈ కారును కొనుగోలుచేసిన వారిలో 20 శాతం మంది కస్టమర్లు అడ్వాన్స్ సీవీటీ ఉండాలన్న అభ్యర్థన మేరకు ఈ నూతన కారును తయారు చేసినట్లు హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ రాజేష్ గోయల్ తెలిపారు. ఈ నూతన మోడల్‌లో అదనపు భద్రత ఫీచర్స్‌ను ఏర్పాటు చేసినట్లు, వీటిలో రియర్ కెమెరా, స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకునే విధంగా టెక్నాలజీ పరంగా పలు మార్పులు చేసినట్లు ఆయన చెప్పారు.

889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles