లాట్ పండుగ ఆఫర్లు భళా

Tue,October 8, 2019 12:37 AM

హైదరాబాద్, అక్టోబర్ 7: మొబైల్ రిటైల్ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న లాట్ మొబైల్స్.. పండుగ ఆఫర్లకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గత నెల 29న దసరా, దీవాలీ పండుగ ఆఫర్లను లాట్ మొబైల్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఆఫర్లను కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరింది. మొబైల్ ఎక్సేంజ్‌పై 60 శాతం వరకు రాయితీలు, రూ.5 వేల వరకు ఎక్సేంజ్ క్యాష్ బోనస్, 30 శాతం దాకా పేటీఎం క్యాష్ బ్యాక్, 10 శాతం వరకు హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్ బ్యాక్ ఉంటుందని వివరించింది. అలాగే సామ్‌సంగ్ ఎ50ఎస్ కొనుగోలుపై రూ.2 వేల తగ్గింపు, వివో వై సిరీస్‌పై రూ.500 నుంచి 1,500 వరకు తగ్గింపు, ఒప్పో ఎఫ్11ప్రో, ఎఫ్11లపై రూ.2 వేల తగ్గింపునిస్తున్నట్లు పేర్కొంది. బజాజ్ ఫైనాన్స్‌పై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్, ఫోన్‌పేపై రూ.500 వరకు క్యాష్ బ్యాక్, సెలెక్టెడ్ బ్రాండెడ్ మొబైల్స్‌పై వన్‌టైం స్క్రీన్ రీప్లెస్‌మెంట్ ఉచితమని సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది. 6 నెలల స్క్రీన్ రిప్లెస్‌మెంట్ సర్వీస్‌పై ఎక్స్‌టెండ్ వారెంట్ ఉచితమని, డెబిట్ కార్డుపై కేవలం రూపాయి చెల్లించి మొబైల్ పొందవచ్చని స్పష్టం చేసింది. వడ్డీ లేకుండా నెలసరి వాయిదాలతో మిగతా మొత్తాన్ని చెల్లించే వీలుందని చెప్పింది. అలాగే ప్రముఖ మొబైల్ ఫైనాన్స్ సంస్థల ద్వారా మొబైల్ కొన్న కస్టమర్లకు ఒక నెల ఈఎంఐని తామే చెల్లిస్తామని, ప్రతీ మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి ఉంటుందని ప్రకటించింది.

603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles