పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్ భేష్

Fri,April 19, 2019 12:56 AM

Hyderabad best in investment attractiveness

-హైసియా సదస్సులో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పెట్టుబడులతోపాటు నిపుణులను ఆకర్షించడంలో ప్రపంచస్థాయి నగరాల్లో హైదరాబాద్ ఒకటని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) సదస్సు గురువారం ఇక్కడ నోవాటెల్‌లో జరిగింది. దీనికి గౌరవ అతిథిగా హాజరైన ఆయన కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంశంపై ప్రసంగించారు. కాగా, దేశంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి సైడ్‌వాక్, ఫుట్‌పాత్‌లు, పబ్లిక్ స్పేస్ వంటి వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు నిర్మాణం హైదరాబాద్ నగర ఇమేజ్‌ను పెంచిందన్న ఆయన ఈ ప్రాజెక్టును ఇంజినీరింగ్, ఫైనాన్షియల్ ఇన్నోవేషన్‌గా అభివర్ణించారు. మెట్రో స్టేషన్ డిజైన్, ఇంధన పొదుపు, సైడ్‌వాక్, ఫుట్‌పాత్‌లు, క్యారేజ్‌వేలు, బస్, ఆటో బే లు అత్యున్నత స్థాయిలో నిర్మించినట్లు వెల్లడించారు. పీపీపీ మోడల్‌లో నిర్మించిన ఈ ప్రాజెక్టుపై పలువురు నిర్మాణ రంగ నిపుణులు ప్రశంసలు కురిపించినట్లు తెలిపారు. రోజూ 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ప్రతీ వారంలో 4 వేల మంది కొత్త ప్రయాణీకులు రికార్డవుతున్నట్లు వెల్లడించారు. ఇదిలావుంటే ఏయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో వెంబడి టౌన్‌షిప్‌లు అభివృద్ధి పరుచాలని ప్రభుత్వ ఉద్దేశంగా ఉందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని నివాస, వాణిజ్య నిర్మాణాల ఖర్చును నియంత్రణలో ఉంచుతూ భవిష్యత్తులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు.

653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles