ఇండిగో సమ్మర్‌ సేల్‌ ఆఫర్‌

Wed,May 15, 2019 02:14 AM

I ndiGo announces 3 days summer sale

న్యూఢిల్లీ, మే 14: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో..వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 16 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్‌ను 53 దేశీయ, 17 అంతర్జాతీయ రూట్లలో నడిచే సర్వీసులకు వర్తింపచేసింది. అన్ని పన్నులు కలుపుకొని ప్రారంభ విమాన టిక్కెట్‌ ధరను రూ.999గా నిర్ణయించింది. ఈ ఆఫర్‌ కింద బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు ఈ నెల 29 నుంచి సెప్టెంబర్‌ 28 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో ఢిల్లీ-అహ్మదాబాద్‌, ముంబై-హైదరాబాద్‌, హైదరాబాద్‌-దుబాయి, చెన్నై-కువైట్‌, ఢిల్లీ-కౌలాలంపూర్‌, బెంగళూరు-మాలే మధ్య నడిచే సర్వీసులతోపాటు ఇతర సర్వీసులకు కూడా ఈ ఆఫర్‌ వర్తించనున్నదని ్ల ఇండిగో చీఫ్‌ కమర్షియల్‌ అధికారి విలియమ్‌ బౌల్టర్‌ తెలిపారు. హాలీడే సీజన్‌లో అధిక బరువును తీసుకువెళ్లే వారికి 30 శాతం రాయితీని కూడా సంస్థ ఇస్తున్నది.

895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles