ఎన్‌ఆర్‌ఐలకు పేపర్ రహిత ఖాతా సేవలు ప్రారంభించిన ఐడీబీఐ బ్యాంక్

Wed,April 17, 2019 12:26 AM

IDBI Bank launches paperless account facility for NRIs

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: నలభై దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయు(ఎన్‌ఆర్)లు ఎలాంటి పేపర్ డాక్యుమెంట్ లేకుండానే బ్యాంక్ ఖాతా తెరుచుకునే అవకాశాన్ని కల్పించింది ఐడీబీఐ బ్యాంక్. ఎన్‌ఆర్‌ఐ-ఇన్‌స్టా-ఆన్‌లైన్ అకౌం ట్ పేరుతో ప్రారంభించిన ఈ సేవల ద్వారా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్)లో సభ్యత్వం కలిగిన దేశాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు ఖాతా తీసుకోవచ్చును. ఖాతాదారుడు ఎలాంటి డాక్యుమెంట్‌ను, కేవైసీ ప్రూఫ్స్ ను జతపరుచాల్సిన అవసరం లేదు. శాఖకు రాకుండానే ప్రవాస భారతీయులకు బ్యాంక్ ఖాతా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎఫ్‌ఏటీఎఫ్‌లో అమెరికా, బ్రిటన్, ఇండియా, జపాన్, చైనా, ఫ్రాన్స్‌లతోపాటు 32 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles