పోటీతత్వంలో తిరోగమనం

Thu,October 10, 2019 02:05 AM

10 స్థానాలు దిగజారి 68వ స్థానంలోకి భారత్: వరల్డ్ ఎకనమిక్ ఫోరం
న్యూఢిల్లీ/జెనివా, అక్టోబర్ 9: ప్రపంచంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశాల్లో తొలి వరుసలో నిలిచిన భారత్‌కు పోటీతత్వంలో మాత్రం వెనుకడింది. ప్రస్తుత సంవత్సరానికిగాను విడుదలైన దేశాల జాబితాలో భారత ర్యాంక్ పది స్థానాలు పడిపోయి 68వ స్థానానికి జారుకున్నదని వార్షిక గ్లోబల్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్ పేరుతో వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) తాజా నివేదికను విడుదల చేసింది. పలు దేశాలు ర్యాంక్‌లు మెరుగుపడినప్పటికీ భారత్ ర్యాంక్ పడిపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. ప్రపంచంలో అత్యంత పోటీ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో సింగపూర్ తొలిస్థానాన్ని ఆక్రమించుకున్నది. ఇప్పటి వరకు తొలిస్థానంలో ఉన్న అమెరికా రెండో స్థానంతో సరిపెట్టుకున్నది. గతేడాదిలో భారత్ 58వ స్థానంలో ఉన్నది. ఈ జాబితాలో బ్రిక్స్ దేశాలు ర్యాంకులు మెరుగుపడలేదు. భారత్ కంటే తక్కువగా బ్రెజిల్ 71వ స్థానంతో సరిపెట్టుకున్నది. భారత్ గురించి తాజాగా విడుదలైన నివేదికలో పలు అంశాలు..


-కార్పొరేట్ గవర్నెన్స్‌లో భారత ర్యాంక్ 15 స్థానాలు మెరుగుపడి రెండో స్థానానికి ఎగబాకింది.
-మార్కెట్ సైజ్‌లో మూడో స్థానంలో ఉండగా..రెన్యువబుల్ ఎనర్జీ రెగ్యులేషన్‌లోనూ మూడో స్థానం దక్కింది.
-ఇన్నోవేషన్‌లో ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత్ మెరుగుపడింది.
-ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగాలను ఆపాదించుకునే దేశాల్లో భారత్ దూసుకుపోతున్నది.
-ఆరోగ్యకరమైన ఆయుర్దాయం జాబితాలో భారత్‌కు 109వ స్థానం లభించింది. మొత్తంగా 141 దేశాలు ఉన్నాయి. దక్షిణాసియా దేశాల కంటే దిగువస్థానంలో ఆఫ్రికా ఉన్నది
-మహిళ, పురుషుల కార్మికుల మధ్య అంతరం 0.26 శాతంగా ఉన్నది. ఈ జాబితాలో ర్యాంక్ 128వ స్థానంలో ఉన్నది.
-ప్రతిభావంతులు, ప్రోత్సాహక దేశాల ర్యాంకుల్లో 118వ స్థానంలో ఉండగా, నైపుణ్యంలో 107వ స్థానం లభించింది.
-పొరుగు దేశాల కంటే భారత్ ఉచ్చమైన స్థితిలో ఉన్నది. శ్రీలంక 84వ స్థానంలోనూ, బంగ్లాదేశ్ 105వ, నేపాల్ 108, పాకిస్తాన్ 110వ స్థానంలో నిలిచాయి.
-గడిచిన ఏడాదికాలంలో కొలంబియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల ర్యాంకులు మెరుగుపడి భారత్‌ను దాటేశాయి.
-అంతర్జాతీయ మందగమన పరిస్థితు లు భారత్‌పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయని నివేదిక పేర్కొంది.
-సింగపూర్ తొలి స్థానం వరించగా, రెండో స్థానంలో అమెరికా, ఆ తర్వాతి స్థానంలో హాంకాంగ్, నెదర్లాండ్స్‌కు 4వ స్థానం, స్విట్జర్లాండ్‌కు ఆ తర్వాతి స్థానం వరించింది.
-కొరియా, జపాన్, ఫ్రాన్స్, చైనాల ఆర్థిక స్థితిగతులు బలపడ్డాయి.
-బ్రిక్స్ దేశాల నుంచి చైనా ఒక్కటే 28వ స్థానం లభించింది.

212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles