పటన్‌చెరులో అయాన్ పరిశోధన కేంద్రం

Sat,August 10, 2019 12:59 AM

Ion exchange inaugurates new Research and Development centre in Patancheru

-రూ.30 కోట్లతో ఏర్పాటు చేసిన సంస్థ

హైదరాబాద్, ఆగస్టు 9: నీటి శుద్ది పరికరాలు, కెమికల్స్ తయారీ సంస్థ అయాన్ ఎక్సేంజ్..హైదరాబాద్‌కు అత్యంత సమీపంలోని పటన్‌చెరు వద్ద నూతన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది. 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆర్ అండ్ డీ కోసం రూ.30 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ రాజేశ్ శర్మ చెప్పారు. ప్రస్తుతం ఈ సెంటర్‌లో 29 మంది సైంటిస్టులు విధులు నిర్వహిస్తుండగా, త్వరలో ఈ సంఖ్యను 45కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1,195 కోట్ల ఆదాయంపై రూ.65 కోట్ల లాభా న్ని గడించింది. ఈసారి రూ. 1,500 కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా ఆరు ఉత్పత్తి కేంద్రాలు ఉండగా, విదేశాల్లో(బంగ్లాదేశ్, యూఏఈ)లో ఉన్నాయి. సంస్థకు వచ్చిన మొత్తం ఆదాయంలో 35 శాతం కెమికల్ విభాగం నుంచి రాగా, 55 శాతం ఇంజినీరింగ్, మరో 10 శాతం కన్జ్యూమర్ విభాగం నుంచి వచ్చింది. హైదరాబాద్‌తోపాటు ముంబైలో ఉన్న పరిశోధన కేంద్రాల్లో 60 మంది సిబ్బంది ఉండగా, త్వరలో ఈ సంఖ్యను 75కి పెంచుకోవాలని చూస్తున్నది. వ్యాపార విస్తరణలో భాగంగా ఇకనుంచి ప్రతియేటా రెండు నుంచి మూడు ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles