జెట్‌లో కొనసాగుతున్న రాజీనామాలు

Wed,May 15, 2019 02:20 AM

Jet Airways CEO Vinay Dube resigns

-కంపెనీ సీఈవో విజయ్‌ దుబేతోపాటు మరో ఇద్దరు గుడ్‌బై
ముంబై, మే 14: ఆర్థిక సంక్షోభంతో మూతపడిన విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో రాజీనామాల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి వినయ్‌ దుబేతోపాటు మరో ఇద్దరు తమ పదవులకు మంగళవారం రాజీనామా చేశారు. కంపెనీ డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి అమిత్‌ అగర్వాల్‌తోపాటు కంపెనీ సెక్రటరీ కులదీప్‌ శర్మ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. రెండు రోజుల్లో ముగ్గురు సీనియర్‌ ఉన్నతాధికారులు సంస్థను వీడుతున్నట్లు ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. భారత సంతతికి చెందిన దుబే..జెయిట్‌ ఎయిర్‌వేస్‌లో ఆగస్టు 2016లో చేరారు. అంతకుముందు ఆయన డెల్టా ఎయిర్‌లైన్స్‌, సబ్రే ఇండస్ట్రీస్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో విధులు నిర్వహించారు. దుబే రాజీనామా వెంటనే అమలులోకి రానున్నట్లు కంపెనీ స్టాక్‌ ఎక్సేంజ్‌కు సమాచారం అందించింది.

గత నెలలో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ రాజశ్రీ పాతే, నాన్‌-ఎగ్జిక్యూటివ్‌, నాన్‌-ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ నసీం జైది, హోల్‌టైం డైరెక్టర్‌ గౌరంగ్‌ శెట్టిలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ చేతిలోకి వచ్చిన తర్వాత ఐదుగురు ఉన్నతాధికారులు సంస్థను వీడటం ఇదే తొలిసారి. ప్రస్తుతం సంస్థకు రూ.8 వేల కోట్ల అప్పు ఉండగా, ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి కంపెనీలో 31.2 శాతం నుంచి 75 శాతం వరకు వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించింది. దీంతో స్టాక్‌ మార్కెట్లో కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఒక దశలో 12 శాతానికి పైగా పడిపోయిన షేరు ధర చివరకు 7.42 శాతం తగ్గి రూ.129.10 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 7.33 శాతం పతనం చెంది రూ.128.90 వద్దకు చేరింది. బీఎస్‌ఈలో 22.14 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో కోటి షేర్లు చేతులు మారాయి.

438
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles