హైదరాబాద్‌లో జోయాలుక్కాస్ నాలుగో షోరూం

Thu,April 18, 2019 12:29 AM

Kajol Joyalukkas AS Rao Nagar Hyderabad

-ప్రారంభించిన బాలీవుడ్ నటి కాజోల్
కాప్రా, ఏప్రిల్ 17: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్..హైదరాబాద్‌లో మరో షోరూంను ప్రారంభించింది. ఏఎస్‌రావు నగర్‌లో ఏర్పాటు చేసిన షోరూంను ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ దేవ్‌గణ్ బుధవారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఇదివరకే భాగ్యనగరంలో మూడు షోరూంలను నిర్వహిస్తున్న సంస్థకు ఇది నాలుగోది. ఈ సందర్భంగా జోయాలుక్కాస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జోయ్ అలుక్కాస్ మాట్లాడుతూ..వినియోగదారుల నుంచి వచ్చిన సహకారం, నిరంతర ప్రోత్సాహం వల్లనే వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించినట్లు చెప్పా రు.

కస్టమర్లకు నచ్చే అన్ని రకాల డిజైన్లతో కూడిన ప్రపంచ స్థాయి ఆభరణాలను ఈ షోరూంలో అందుబాటులో ఉంచామని, ఈ నూతన షోరూం ప్రారంభోత్సవ సందర్భంగా ప్రతి కొనుగోలుపై కచ్ఛితమైన బహుమతులు అందించడంతోపాటు, ఉచిత నిర్వహణ, బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగం గా వచ్చే ఏడాది చివరి నాటికి షోరూంల సంఖ్యను 200కి పెంచుకోనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కొత్త జోయాలుక్కాస్ షోరూం ప్రారంభం సందర్భంగా వేలాదిమంది అభిమానులను, ఆభరణాల ప్రేమికులను కలుసుకోవడం మధురానుభూతినిచ్చిందన్నారు. కాజోల్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో షోరూమ్ ఉన్న ప్రాంతం ప్రజలతో కిక్కిరిసింది.

990
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles