పశ్చిమాన్నే అధిక అద్దెలు

Tue,August 13, 2019 12:49 AM

Leasing of warehousing spaces jumps 31 per cent in 8 major cities

-హైదరాబాద్‌లో అద్దెలపై సీబీఆర్‌ఈ నివేదిక
-దక్షిణదిలో వస్తు రవాణాకు పెరిగిన గిరాకీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పారిశ్రామిక, వస్తు రవాణా మార్కెట్ విభాగంలో హైదరాబాద్‌లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో 12 నుంచి 18 శాతం మేరకు అధిక అద్దెలు గిట్టుబాటు అవుతున్నాయని సీబీఆర్‌ఈ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఈ సంస్థ 2019 మొదటి ఆరు నెలల్లో పారిశ్రామిక, వస్తు రవాణా మార్కెట్‌కు సంబంధించిన అధ్యయన నివేదికను సోమవారం విడుదల చేసింది. 2019 ద్వితీయార్థంలో ఉత్తర హైదరాబాద్‌లో కొత్త సంస్థలు స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశముందని, ఫలితంగా అద్దెలు గణనీయంగా పెరుగుతాయని విశ్లేషించింది. 2019 ప్రథమార్థంలో లాజిస్టిక్స్ లీజింగ్ విభాగంలో దాదాపు 1.30 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని పలు సంస్థలు లీజుకు తీసుకున్నాయని వెల్లడించింది. దీంతో గతేడాది మొదటి ఆరునెలలతో పోల్చితే, 2019 ప్రథమార్థంలో సుమారు 31 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నది. 2018 మొదటి అర్థ సంవత్సరంతో పోల్చితే 2019 ప్రథమ విభాగంలో 56 శాతం స్థలాన్ని మూడు బడా సంస్థలు తీసుకున్నాయని వెల్లడించింది. ఇందులో దాదాపు ఎనభై ఐదు శాతం స్థానిక సంస్థలే స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయని తెలియజేసింది. 50 వేల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకునే విభాగంలో 38 శాతం అమ్మకాలు పెరిగాయని నివేదికలో పేర్కొన్నది. ఈ- కామర్స్, రిటైల్ సంస్థల వాటా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 2020 నాటికల్లా భారత లాజిస్టిక్స్ విభాగం 6 కోట్ల చదరపు అడుగుల స్థలానికి చేరుకునే అవకాశముందని సీబీఆర్‌ఈ ఛైర్మన్ అంశుమన్ మ్యాగజీన్ తెలిపారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించడంలో భారత్ మొదటి ఐదు స్థానాలకు చేరుకునే అవకాశముందన్నారు. హైదరాబాద్‌లో ముప్పయ్ నుంచి యాభై లక్షల్లోపు చదరపు అడుగుల స్థలంలో సరికొత్త గిడ్డంగులు ఏర్పాటవుతుందన్నారు.

369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles