మళ్లీ మలేషియా పామాయిల్

Fri,November 15, 2019 02:52 AM

-కొనుగోలు చేస్తున్న భారత వ్యాపారులు
-టన్నుపై 5 డాలర్ల రాయితీ

ముంబై, నవంబర్ 14: భారతీయ రిఫైనర్లు.. మలేషియా పామాయిల్ కొనుగోళ్లకు మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నారు. దాదాపు నెల రోజుల విరామం తర్వాత మలేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకునే దిశగా దేశీయ వ్యాపారులు ముందుకెళ్తున్నారు. టన్నుకు 5 డాలర్లు (సుమారు రూ.360) చొప్పున రాయితీని మలేషియా ప్రకటించడంతో అక్కడి నుంచే పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాలని భారతీయ వ్యాపారులు సిద్ధమైయ్యారు. డిసెంబర్ నెల కోసం దాదాపు 70 వేల టన్నుల పామాయిల్ దిగుమతులకు ఒప్పందాలను దేశీయ రిఫైనరీలు కుదుర్చుకున్నాయి.

ఈ మేరకు గురువారం ఐదుగురు వర్తకులు స్పష్టం చేశారు. కశ్మీర్ అంశంలో భారత్ తీరును మలేషియా తప్పుబట్టడంతో దేశీయ రిఫైనర్లు ఆ దేశ పామాయిల్‌ను పక్కనబెట్టారు. ఇండోనేషియా నుంచి దిగుమతులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇండోనేషియా అమ్మే ధర కంటే టన్నుకు 5 డాలర్లు తక్కువగానే ఇస్తామని మలేషియా ముందుకు వచ్చింది. దీంతో భారతీయ రిఫైనర్లు తమ రూటు మార్చుకున్నారు. మలేషియా పామాయిల్ కొనుగోలుదారుల్లో భారతే అగ్రస్థానంలో ఉన్నది.

451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles