ఈడీ అదుపులో మల్వీందర్ సింగ్

Fri,November 15, 2019 03:01 AM

న్యూఢిల్లీ, నవంబర్ 14: మోసం చేసిన కేసులో అరస్టై ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్న ర్యాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ). రూ.740 కోట్ల మోసంలో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలో నేపథ్యంలో సింగ్ బ్రదర్స్‌లను అరెస్ట్ చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. గత నెలలోనే శివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్‌లు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రెలిగేర్ ఫిన్వెస్ట్ సంస్థలో రూ.740 కోట్ల నిధుల గోల్‌మాల్ జరిగినట్లు గతేడాది ఆగస్టులో బట్టబయలు అయింది. గతేడాది డిసెంబర్‌లో వీరిద్దరికి వ్యతిరేకంగా పోలీసులు కేసును నమోదు చేశారు. ఐదు నెలల తర్వాత వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం వీరి కస్టడిలో ఉన్నారు. ఈ కేసులో ఈడీ జోక్యం చేసుకొని వీరిపై మనీ ల్యాండరింగ్ కింద కేసును దాఖలు చేసింది.

210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles