30న మారుతి ఎస్-ప్రెస్సో

Sun,September 22, 2019 01:04 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ఈ నెల 30న మినీ ఎస్‌యూవీ ఎస్-ప్రెస్సో మోడల్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. వచ్చేది పండుగ సీజన్‌కావడంతో వాహనాల అమ్మకాలను పెంచుకునే ఉద్దేశంలో భాగంగా ఈ నూతన కారును విడుదల చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కారు దేశీయ టెక్నాలజీతో, దేశీయ అవసరాల నిమిత్తం తయారు చేసింది సంస్థ. యువత కారు కొనే సమయంలో గతంలో తక్కువ ధర, నిర్వహణ ఖర్చు అనేది చూసేవారు..కానీ ప్రస్తుతం డిజైనింగ్, లగ్జరీ లుక్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఎంట్రి కార్ల విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో విడుదల చేస్తున్న ఈ కారులో లగ్జరీ లుక్, ప్రీమియం ఫీచర్లు ఉన్నాయన్నారు. మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ రామన్ మాట్లాడుతూ..కొనుగోలుదారుల జీవన ప్రమాణాలు, వారి అభిరుచులకు తగ్గట్టుగా ప్రతిసారి నూతన సెగ్మెంట్‌కు సంబంధించిన కార్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles