రాష్ట్రంలో మరో 15 దవాఖానలు

Thu,October 10, 2019 01:28 AM

భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మ్యాక్సివిజన్
హైదరాబాద్, అక్టోబర్ 9: హైదరాబాద్ కేంద్రస్థానంగా హెల్త్‌కేర్ సేవలు అందిస్తున్న మ్యాక్సివిజన్..వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. కంటి ఆరోగ్య సంరక్షణ ఆసుపత్రుల విభాగంలో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వరంగల్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న శరత్ లేజర్ ఐ ఆసుపత్రిని కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాల్టీ ఐ హాస్పిటల్స్ చైర్మన్ జీఎస్‌కే వేలు మాట్లాడుతూ..ఈ నూతన జాయింట్ వెంచర్‌తో తెలుగు రాష్ర్టాల్లో కంటి సంహరక్షణ ఆసుపత్రుల రెండో అతిపెద్ద సంస్థగా అవతరించినట్లు చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా 2021 నాటికి మరో 15 హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. వీటిలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మిర్యాలగూడ్‌లలో నెలకొల్పుతున్న ఆసుపత్రులు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుండగా, మిగతావి వచ్చే ఏడాది చివరినాటికి ప్రారంభించబోతున్నట్లు ఆయన మీడియాకు చెప్పారు. రాబోయే ఐదేండ్లకాలంలో మ్యాక్సివిజన్‌ను రూ.500 కోట్ల కంపెనీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, దీంట్లోభాగంగా వ్యాపారాన్ని తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళకు కూడా విస్తరించాలనుకుంటున్నట్లు తెలిపారు.

302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles