ఎన్నికల వరకు అంతంతే

Fri,March 15, 2019 12:41 AM

Mercedes Benz launches AMG C 43 4MATIC Coupe in India priced at Rs 75 lakh

-ఆ తర్వాతనే వాహన అమ్మకాలు పెరిగే అవకాశం
-మెర్సిడెజ్ బెంజ్ ఎండీ మార్టిన్ స్కేవెంక్

న్యూఢిల్లీ, మార్చి 14: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..దేశీయ అమ్మకాలపై పెదవి విరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో అంతంత మాత్రమే ఉండనుండగా, ఎన్నికల తర్వాతనే పెరిగే అవకాశం ఉన్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ దేశీయ మార్కెట్లోకి రూ.75 లక్షల విలువైన ఏఎంజీ సీ 43 4ఎంఏటీఐసీ కౌప్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ స్కేవెంక్ మాట్లాడుతూ..అమ్మకాలు నిలకడ స్థాయిలో ఉన్నాయని, గతేడాది పోలిస్తే భారీగా పెరిగే అవకాశాలేమి కనిపించడం లేదు..షోరూంలను సందర్శించడానికి ఎంతోమంది కస్టమర్లు వస్తున్నారు..కానీ కొనుగోలు చేయడానికి సంశయిస్తున్నారని చెప్పారు. అధిక వడ్డీరేట్లు, నిధుల కొరత కారణంగా నాన్-బ్యాంకింగ్ సంస్థలు రుణాలు ఇవ్వలేకపోవడం, వినియోగదారులు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం వంటి కారణాలతో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సెంటిమెంట్ బలహీనంగా ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అంతకుముందు రెండు నెలల పాటు కార్ల విక్రయాలు పడిపోనున్నాయని, ఫలితాల తర్వాత సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతే భారీగా పుంజుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు విడుతల వారిగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంమీద ఈ ఏడాదిపై ఆశావాద దృక్ఫతంతో ఉన్నట్లు, దేశీయ మార్కెట్లోకి ప్రవేశించి 25 ఏండ్లు పూర్తైన సందర్భంగా పలు కార్లపై రాయితీ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, నూతన కారు విషయానికి వస్తే రెండు డోర్లు కలిగిన ఏఎంజీ సీ43 4 ఎంఏటీఐసీ కౌప్‌ను మూడు లీటర్ల వీ6 పెట్రోల్ ఇంజిన్‌తో తయారు చేసింది. 287 కిలోవాట్ల పవర్‌ను ఇవ్వనున్న ఈ కారు కేవలం 4.7 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. ప్రస్తుత సంవత్సరంలో పది కార్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ ప్రవేశపెట్టిన రెండో కారు ఇది కావడం విశేషం.

1252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles