దుకాణదారులకు పెన్షన్

Sat,April 20, 2019 02:16 AM

Modi Fire On Congress Party

-క్రెడిట్ కార్డు, రూ.50 లక్షల వరకు హామీ లేని రుణం..
-రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా
-జాతీయ వ్యాపారవేత్తల సంక్షేమ బోర్డు ఏర్పాటు..
-ఎన్నికల వేల మోదీ తాయిలాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు దెబ్బకు భారీగా నష్టపోయిన వ్యాపారస్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ భారీ తాయిలాలు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే కిరాణా దుకాణాదారులకు పెన్షన్ సదుపాయంతోపాటు వ్యాపారవేత్తలకు ఎలాంటి హామీ లేకుండా రూ.50 లక్షల వరకు రుణం, క్రెడిట్ కార్డు, జీఎస్టీలో రిజిస్టార్ అయిన సంస్థలకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా, నూతన రిటైల్ పాలసీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రధాని ప్రకటించారు. జాతీయ వ్యాపారవేత్తల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. న్యూఢిల్లీలో ట్రేడర్ల కన్వెన్షన్ సమావేశానికి హాజరైన మోదీ..ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. వ్యాపారవేత్తలను కాంగ్రెస్ దొంగలుగా పిలుస్తున్నదని, మహాత్మ గాంధీ కూడా మీ సామాజిక వర్గం నుంచి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గడిచిన 70 ఏండ్లుగా పరిపాలించిన కాంగ్రెస్..వ్యాపారవేత్తలను అన్ని రకాలుగా వాడుకొని అవమానాలకు గురి చేసిందన్నారు. గడిచిన ఐదేండ్లకాలంలో మీ జీవన విధానం, వ్యాపారం మరింత సులభతరంగా జరుగడానికి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నానని శుక్రవారం ఢిల్లీలో వ్యాపారవేత్తలతో జరిగిన సమావేశంలో సూచించారు.

ఐదేండ్లలో 1,500 పురాతన చట్టాలు రద్దు

గడిచిన ఐదేండ్లలో 1,500 పురాతన చట్టాలను రద్దు చేసిన విషయాన్ని ప్రధాని స్పష్టంచేశారు. దేశీయ ఆర్థిక వ్యవస్థకు వ్యాపారవేత్తలు వెన్నుముఖ లాంటివారని, కానీ గత ప్రభుత్వాలు వీరిని పట్టించుకోలేదని ప్రధాని విమర్శించారు. మీరు లేకపోతే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తలు చాలా కష్టపడి పనిచేస్తారని..ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవడానికి దోహదం చేస్తారన్నారు. మే 23న జరుగనున్న ఎన్నికల ఫలితాల్లో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని సర్కార్ ఏర్పాటు అయిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలకోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రిటైల్ రంగానికి ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో జాతీయ రిటైల్ పాలసీని ప్రకటించనున్నదన్న ఆయన..జీఎస్టీలో రిజిస్టార్ చేసుకున్న వ్యాపారవేత్తలకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

యువతీయువకులను ప్రోత్సహించే ఉద్దేశంతో భాగంగా బీజేపీ సర్కా ర్..ఒక స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి రూ. 20 వేల కోట్ల నిధులను పెట్టుబడి రూపంలో పెట్టనున్నట్లు, 2024 నాటికి దేశవ్యాప్తంగా 50 వేల స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించిందన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి నూతన ఇంక్యూబేషన్ జోన్లను ఏర్పాటు చేయడంతోపాటు ప్రాం తీయ బాడీలతో ఇంక్యూబేటర్లను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందని ప్రధాని చెప్పారు. వ్యాపార రంగంలో పారదర్శకత వహించాలనే ఉద్దేశంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని అమలులోకి తీసుకొచ్చామని, తద్వారా ట్రేడర్లు రెండుసార్లు రిజిస్టార్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఒకటిన్నర రెట్లు పెంచగలిగామన్నారు. వ్యాపార రంగంలో తీసుకున్న విప్లవాత్మక చర్యలతో సులభతర వాణిజ్య విధానంలో భారత్ ర్యాంక్ మెరుగుపడిందని, ప్రస్తుతం ఇది 77 స్థాయిలో ఉండగా, వచ్చే ఐదేండ్లలో దీనిని 50 కంటే దిగువకు తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇన్‌స్పెక్టర్ రాజాకు మంగళం పాడామని, ఆదాయ పన్ను అసెస్‌మెంట్ చట్టాలను పూర్తిగా మార్చివేసి సులభతరంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు.

సంక్షేమ పథకాలకు పెద్దపీట

సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు 70 వేల ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్లను మం జూరు చేస్తున్నట్లు, 50వేల ఇండ్లకు విద్యుత్ సరఫరా, 2 లక్షల జన్ ధన్ బ్యాంక్ ఖాతా, ముద్రా స్కీం కింద లక్ష మంది వ్యాపారవేత్తలకు రుణాలు అందించినట్లు చెప్పారు.

7998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles