గీత దాటితే ప్రీమియం వాతే!

Sun,September 8, 2019 03:03 AM

Motor insurance is no longer a burden for those who violate traffic rules

-ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఇక మోటర్ ఇన్సూరెన్స్ భారం
-జరిమానాలనుబట్టి రెట్టింపుకానున్న బీమా ధర

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ట్రాఫిక్ నిబంధనలను పాటించనివారిపై ఇప్పటికే భారీ జరిమానాలతో విరుచుకుపడ్డ కేంద్ర ప్రభుత్వం.. మరో రకంగా కూడా వారి దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే బీమా ప్రీమియంను రెట్టింపు చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ)కు సూచనలు చేసింది. దీంతో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ జరిమానాలను ఎదుర్కొనేవారికి మోటర్ ఇన్సూరెన్స్ పాలసీల ధరను పెంచాలని ఐఆర్‌డీఏఐ భావిస్తున్నది. ఈ మేరకు ట్రాఫిక్ ఉల్లంఘనలతో మోటర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను త్వరలో ఐఆర్‌డీఏఐ అనుసంధానించనున్నది. ఆయా బీమా రంగ సంస్థలకూ వాటిని పంపనున్నది. ప్రభుత్వ విజ్ఞప్తితో ఈ మొత్తం అంశం పరిశీలనకు ఓ కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసిన ఐఆర్‌డీఏఐ.. రెండు నెలల్లోగా కమిటీ సమర్పించే సిఫార్సుల ఆధారంగా ఓ నిర్ణయానికి రానున్నది. ఈ నెల 1 నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు పడుతున్న విషయం తెలిసిందే.

ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అమలు
శుక్రవారం ఐఆర్‌డీఏఐ జారీ చేసిన ఆదేశాలతో దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. కమిటీ సిఫార్సులు వచ్చాక దేశవ్యాప్తంగా అమలయ్యే వీలున్నది. బీమా ధర పెరిగితే రోడ్డు ప్రమాదాలు తగ్గే వీలుందని, వాహన చోధకుల ప్రవర్తన కూడా మారే అవకాశాలున్నాయని ఐఆర్‌డీఏఐ అభిప్రాయపడుతున్నది. కాగా, అంతర్జాతీయంగా అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి భారత్‌కు అనువైన విధానాన్ని కమిటీ సూచించాల్సి ఉంటుంది. రాష్ర్టాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్నీ పరిశీలించాలి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఆ వివరాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీల నుంచి ఐఐబీఐ డేటాబేస్‌కు బదిలీ అయ్యేలా ఓ వ్యవస్థను సిఫార్సు చేయాలి.

963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles