ఎన్‌సీసీ 75 శాతం డివిడెండ్

Sat,May 25, 2019 12:13 AM

NCC has a 75 per cent dividend

హైదరాబాద్, మే 24: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ర్టానికి చెందిన మౌలిక సదుపాయాల సంస్థ ఎన్‌సీసీ లిమిటెడ్ 75 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. శుక్రవారం సమావేశమైన బోర్డు రూ.2 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.1.50 డివిడెండ్ రూపంలో వాటాదారులకు చెల్లించబోతున్నది. త్వరలో జరుగనున్న వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల అనుమతి తీసుకోనున్నది. ఈ డివిడెండ్ కోసం సంస్థ రూ.120.13 కోట్ల నిధులను వెచ్చించనున్నది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.3,389 కోట్ల టర్నోవర్‌పై రూ.174.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది మొత్తానికి వచ్చిన రూ.12,080 కోట్ల ఆదాయంపై రూ.563.91 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది.

436
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles