మార్కెట్లకు ఎగ్జిట్‌పోల్స్ జోష్?

Mon,May 20, 2019 12:25 AM

NDA Sarkar is likely to be the highest level of opportunity

-ఈ వారంలో భారీగా పుంజుకునే అవకాశం
-అంచనా వేస్తున్న మార్కెట్ పండితులు..

న్యూఢిల్లీ, మే 19: సార్వత్రిక ఎన్నికల రణరంగం ముగిసింది. ఇక మిగిలింది తుది ఫలితాలే. ప్రస్తుతం ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌కు అత్యధిక మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయని ఆదివారం విడుదలైన ఎగ్జిట్ ఫలితాలు స్పష్టంచేయడంతో ఈ వారంలో స్టాక్ మార్కెట్లలో భారీ కదలిక రావచ్చునని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2014లో వచ్చిన దానికంటే ఈ సారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌కు అత్యధిక మెజార్టీ రావచ్చునని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తుది ఫలితాలు మాత్రం ఈ నెల 23న విడుదల కాబోతున్నాయి. అప్పటి వరకు స్టాక్ మార్కెట్లు దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయని మార్కెట్ పండితులు అంచనావేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో గడిచిన రెండు నెలలుగా తీవ్ర ఆటుపోటులకు గురైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం నుంచి ఆకాశమే హద్దుగా దూసుకుపోయే అవకాశం ఉన్నదని ఎపిక్ రీసర్చ్ ముస్తాఫా నదీమ్ తెలిపారు.

దీర్ఘకాలికంగా దృష్టిలో పెట్టుకొని మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరిపేందుకు ఆస్కారం ఉన్నదని, గత కొన్నేండ్లుగా ఎన్నిలక ఫలితాలు వచ్చినప్పుడు మార్కెట్లు సానుకూలంగా స్పందించాయని, ఈ సారి అంతకుమించి స్పందన రావచ్చునని ఆయన అంచనావేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను స్టాక్ మా ర్కెట్లకు ఈ వారం చాలా మంచి వారమని, స్టాక్ కోటాకు బదులు ఓటు కోటాగా మారిపోయిందని స్యామ్‌కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్ నోట్ ఫౌండర్, సీఈవో జిమీట్ మోదీ తెలిపారు. ఎన్నికల ఫలితాలతోపాటు కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఈ వారంలో టాటా మో టర్స్, కెనరా బ్యాంక్, సిప్లాలు గడిచిన త్రైమాసికానుకుగాను ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి. వీటికి తోడు అమెరికా-చై నా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితు లు..క్రూడాయిల్ ధరల శ్రేణి, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ, దేశీయ ఈక్విటీ-డెబిట్ మార్కెట్లోకి విదేశీ సంస్థగత పెట్టుబడిదారులు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అంశాల్లో ఇవి ఒకటని చెప్పా రు. గడిచినవారంలో సెన్సెక్స్ 467.78 పాయింట్లు లేదా 1.21 శాతం, నిఫ్టీ 150.5 పాయింట్లు ఎగబాకి 11,407.15 వద్ద ముగిసింది.

టాప్-10లో లాభపడ్డ 9 సంస్థలు

గడిచిన వారంలో టాప్-10 సంస్థల్లో తొమ్మిదింటి మార్కెట్ విలువ భారీగా పెరిగింది. బ్యాంకింగ్ రంగ సంస్థలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు అత్యధికంగా లాభపడటంతో వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.82,379.79 కోట్ల మేర అధికమైంది. గతవారంలో సెన్సెక్స్ 468 పాయింట్లకు పైగా లాభపడటం ఇందుకు దోహదం చేశాయి. టీసీఎస్ ఒక్కటే తన మార్కెట్ విలువను కోల్పోయింది. గతవారంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా 17,685.54 కోట్లు పెరిగి రూ.6,43,560.05 కోట్లకు చేరాయి. అలాగే కొటక్ మహీంద్రా బ్యాంక్ విలువ కూడా మరో రూ.12,531.51 కోట్లు పెరిగి రూ.2,78,823.62 కోట్లకు చేరగా, హెచ్‌డీఎఫ్‌సీ రూ.10,776.2 కోట్లు అధికమై రూ.3,43,21,158 కోట్లు అధికమయ్యాయి. హెచ్‌యూఎల్ రూ.10,531.29 కోట్లు అధికమై రూ.3,75,738.57 కోట్లకు చేరుకోగా, ఎస్‌బీఐ రూ.9,727.82 కోట్లు అధికమై రూ.2,84,650.48 కోట్లకు నమోదయ్యాయి. రిలయన్స్ ఇంండస్ట్రీస్ లిమిటెడ్ విలువ కూడా రూ.9,635.15 కోట్లు ఎగబాకి రూ.8,02,316.11 కోట్లకు, ఐటీసీ రూ.4,535.7 కోట్ల విలువను పెంచుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,570.66 కోట్లు బలపడి రూ.2,51,682.91 కోట్లకు చేరుకోగా, ఇన్ఫోసిస్ రూ.3,385.92 కోట్లు పెరిగి రూ.3,16,223.26 కోట్లు అధికమయ్యాయి.టీసీఎస్ మాత్రం రూ.14,709.4 కోట్లు తగ్గి రూ.7,86,631.17 కోట్లకు పరిమితమయ్యాయి.

1295
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles