నీట్ లాభం రూ.1,090 కోట్లు

Sun,August 11, 2019 01:23 AM

NIIT Q1 net profit at Rs 1,090 cr

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి సంస్థ నీట్ (ఎన్‌ఐఐటీ) లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.1,090.4 కోట్లుగా నమోదైంది. నీట్ టెక్నాలజీస్‌లో దాదాపు 30 శాతం వాటాను నీట్ లిమిటెడ్ నుంచి బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా (బీపీఈఏ) కొనుగోలు చేసింది. మే నెలలో ముగిసిన ఈ లావాదేవీతో సంస్థకు రూ.2,020.4 కోట్ల నగదు లభించింది. దీంతో సంస్థ లాభం ఒక్కసారిగా పెరిగిపోయింది. నిరుడు ఇదే వ్యవధిలో సంస్థ లాభం రూ.17.9 కోట్లుగా ఉన్నది. గతంతో చూస్తే ఆదాయం ఈసారి రూ.214.3 కోట్ల నుంచి రూ.210.3 కోట్లకు పెరిగింది. ఇదిలావుంటే రూ.335 కోట్ల బైబ్యాక్ కార్యక్రమానికి సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేర్ రూ.125 చొప్పున 2.68 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ కార్యక్రమం ముగియవచ్చని నీట్ వైస్ చైర్మన్, ఎండీ విజయ్ తెలిపారు.

252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles