ఎన్‌ఎండీసీ చేతికి ఆస్ట్రేలియా కంపెనీ

Mon,May 20, 2019 12:26 AM

NMDC mulls acquiring 100 per cent stake in its Aussie arm

-లెగసీలో వాటాను 100 శాతానికి పెంచుకునే అవకాశం
హైదరాబాద్, మే 19: ప్రభుత్వరంగ మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండీసీ..ఆస్ట్రేలియాకు చెందిన లెగసీ ఐరన్‌ను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నది. ఇప్పటికే 76 శాతం వాటాను కొనుగోలు చేసిన ఎన్‌ఎండీసీ..తాజాగా మి గతా 24 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో ఆస్ట్రేలియా స్టాక్ ఎక్సేంజ్(ఏఎస్‌ఎక్స్) నుంచి డీలిస్టింగ్ చేయాలనుకుంటున్నట్లు ఎన్‌ఎండీసీ డైరెక్టర్(ఫైనాన్స్) అమితావ ముఖర్జీ తెలిపారు. ఆస్ట్రేలియాలోని పెర్థ్ కేంద్రస్థానంగా విధులు నిర్వహిస్తున్న లెగసీ ఐరన్ ఓర్ లిమిటెడ్..ఖనిజంతోపాటు బంగారం, బేస్ మెటల్‌లను వెలక్కితీస్తున్నది. లెగసీ గోల్డ్ ప్రాజెక్టులను మరింత అభివృద్ధి పరుచడానికి మరో 10 మిలియన్ల ఏయూడీ(ఆస్ట్రేలియన్ డాలర్) పెట్టుబడి పెట్టేయోచనలో సంస్థ ఉందన్నా రు. ఇప్పటికే సంస్థలో మెజా ర్టీ వాటాదారులమైన మే ము..మిగతా వాటాను కొనుగోలు చేసి హస్తగతం చేసుకోవాలని చూస్తున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఏఎస్‌ఎక్స్ లిైస్టెన లెగసీ ఐరన్ ఓర్‌లో 2011లోనే ఎన్‌ఎండీ 50 శాతం వాటాను కొనుగోలు చేయడానికి 19 మిలియన్ ఏ యూడీలను పెట్టుబడిగా పెట్టింది. ఆ తర్వాతి క్రమంలో ఈ వాటాను 76 శాతానికి పెంచుకున్నది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగం గా సంస్థను అక్కడి స్టాక్ మార్కెట్ నుంచి వైదొలుగాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పశ్చిమ ఆస్ట్రేలియాలో సంస్థకు 19 గనులను నిర్వహిస్తున్నది. వీటిలో ఇనుప ఖనిజంతోపాటు బంగారాన్ని తయారు చేస్తున్నది.

667
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles