ఎన్‌ఎండీసీ లాభం రూ.1,178 కోట్లు

Wed,August 14, 2019 12:05 AM

NMDC profits rise to Rs 1178 crore

హైదరాబాద్, ఆగస్టు 13: ప్రభుత్వరంగ మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ రూ.1,178.01 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.974.29 కోట్లతో పోలిస్తే 21 శాతం అధికం. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికి రూ.3,386.65 కోట్ల ఆదాయాన్ని గడించింది. నిర్వహణ ఖర్చులు రూ.1,071.66 కోట్ల నుంచి రూ.1,474.76 కోట్లకు ఎగబాకినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 8.43 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన సంస్థ..8.67 మిలియన్ టన్నులను విక్రయించినట్లు కంపెనీ సీఎండీ ఎన్ బైజేంద్ర కుమార్ తెలిపారు.

157
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles