ఎన్టీపీసీ లాభం రూ.2,840 కోట్లు

Sun,August 11, 2019 01:01 AM

NTPC profits rise to Rs 2,840 crore

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.2,840.28 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఏప్రిల్-జూన్‌తో పోల్చితే ఇది 5.63 శాతం అధికం. నాడు రూ.2,688.96 కోట్ల లాభాలకే పరిమితమైంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ)కు శనివారం సంస్థ తెలియజేసింది. ఏకీకృత ఆదాయం ఈసారి రూ.26,272.24 కోట్లుగా ఉంటే, పోయినసారి రూ.24,148.50 కోట్లుగా ఉన్నది. ఈ ఏప్రిల్-జూన్‌లో సంస్థ స్థూల విద్యుదుత్పత్తి 76.63 బిలియన్ యూనిట్లుగా ఉన్నది.

134
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles