రియల్ ఎస్టేట్‌లోకి పీఈల వరద

Mon,May 20, 2019 12:20 AM

PE flood in real estate

- 2017-18లో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అనరాక్
న్యూఢిల్లీ, మే 19: రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. 2017-18 క్యాలెండర్ సంవత్సరంలో ఈ రంగంలోకి 1.2 బిలియన్ డాలర్లమేర పెట్టుబడులు వచ్చాయి. మన కరెన్సీలో ఇది రూ.8 వేల కోట్లకు పైమాటే. రెండేండ్ల క్రితం వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే రెండు రెట్లు అధికమని ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ వెల్లడించింది. విదేశీ పెట్టుబడులపై గతంలో ఉన్న నిబంధనలను మరింత సరళతరం చేయడంతో పీఈ ద్వారా వచ్చే పెట్టుబడులు భారీ గా పుంజుకోవడానికి పరోక్షంగా దోహదపడ్డా యి. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి 51 శాతం ఎఫ్‌డీఐలు, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలోకి 100 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ రూట్‌లో అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2015-16 క్యాలెండర్ సంవత్సరంలో పీఈల ద్వారా 600 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రిటైల్ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాయి. 2015 నుంచి 2018 మధ్యకాలంలో 1.84 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. వీటిలో 48 శాతం(880 మిలియన్ డాలర్లు) ద్వి,తృతీయ శ్రేణి నగరాలు ఆకట్టుకోగా, మిగతా 52 శాతం(960 మిలియన్ డాలర్లు) పట్టణాలలోకి వచ్చాయి.

నగరాల విషయానికి వస్తే అమృత్‌సర్, అహ్మదాబాద్, భువనేశ్వర్, ఛండీగఢ్, ఇండోర్, మో హాలీలు అత్యధికంగా ఆకట్టుకున్న చిన్నస్థాయి నగరాలుగా ఉన్నాయి. అమెరికాకు చెందిన ఫండ్స్ సంస్థలైన బ్లాక్‌స్టోన్, గోల్డ్‌మెన్ సాచెస్‌లు 2015 నుంచి 2018 మధ్యకాలంలో బిలియన్ డాలర్లకు పెట్టుబడులు పెట్టాయి. వీటితోపాటు యూఏఈ, సింగపూర్, కెనడా, నెదర్లాండ్స్ దేశాలు కూడా అత్యధికంగా పెట్టుబడులు పెట్టాయి. ఈ సందర్భంగా అనరాక్ క్యాపిటల్ ఎండీ, సీఈవో శోభిత్ అగర్వాల్ మాట్లాడుతూ..కమర్షియల్ ఆఫీస్ రంగంపై ఈ నివేదికలో చోటు కల్పించలేదని, రిటైల్ రంగంలో వచ్చిన పెట్టుబడుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు చెప్పారు. టైర్-1 నగరాల్లో ఉన్న షాపింగ్ మాల్స్‌తో పోలిస్తే ద్వి, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ల పనితీరు ఆమోదయోగ్య స్థాయిలో ఉందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశీయ రిటైల్ రంగంలో బోలెడన్నీ అవకాశాలున్నాయన్నారు. 2019 నుంచి 2022 మధ్యకాలంలో 3.9 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రిటైల్ స్పెస్ అందుబాటులోకి రానున్నట్లు చెప్పింది. వీటితో 71 శాతం టైర్-1 నగరాలకు చెందినది కాగా, టైర్-2, టైర్-3 నగాలకు చెందినది 29 శాతం.

550
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles