సింగరేణి బొగ్గు రవాణాకు సహకరిస్తాం

Sat,September 7, 2019 01:28 AM

Railway GM Gajanan Mallya Review on new railway Routes

-కొత్త రైలుమార్గాలపై రైల్వే జీఎం గజానన్‌మాల్యా సమీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సింగరేణి బొగ్గు రవాణాకు సహకరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌మాల్యా తెలిపారు. శుక్రవారం మణుగూరు, కొత్తగూడెం సింగరేణి ప్రాంతాలను ఆయన సందర్శించారు. మణుగూరు సింగరేణి గనుల నుంచి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరాకు నిర్మించే రైలుమార్గంపై అధికారులతో సమీక్షించారు. కొండాపురం కోల్ స్క్రీనింగ్ ప్లాంట్‌ను సందర్శించి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతివేగంగా వ్యాగన్లలోకి బొగ్గు రవాణాచేస్తున్న తీరును పరిశీలించి అభినందించారు. పీకే ఓపెన్‌కాస్ట్ గనిలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తిని ఆయన పరిశీలించారు. సింగరేణి కోల్ మూవ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్విన్, కోల్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ ఆంటోనిరాజా, మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ బొగ్గు రవాణాకు సంబంధించిన వివరాలను తెలిపారు. సత్తుపల్లి-కొత్తగూడెం మధ్య నిర్మించే రైలుమార్గంపై చర్చించారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, తద్వారా సింగరేణి బొగ్గు రవాణా పర్యావరణ హితంగా జరుగనుందని చెప్పారు. సమావేశంలో సింగరేణి కొత్తగూడెం ఏరియా జీంఎ సీహెచ్ నరసింహారావు, రైల్వే సీనియర్ డీఎం మనోజ్, అధికారులు నాగయ్య, ఆనంద్ భాటియా తదితరులు పాల్గొన్నారు. అనంతరం గజానన్‌మాల్యా ఆర్‌సీహెచ్‌పీ ప్రాంగణంలో మొక్కలను నాటారు.

276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles