30 కోట్లు దాటిన జియో కస్టమర్లు

Mon,April 15, 2019 12:47 AM

Reliance Jio Crosses 30 Crore Users

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: కస్టమర్లను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో దూసుకుపోతున్నది. టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నరేండ్లలో 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న సంస్థగా జియో అవతరించింది. మార్చి 2న ఈ మైలురాయిని సాధించిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరింత సమాచారం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా జియో..30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్నట్లు ప్రకటనను ప్రచారం చేస్తున్నది. పూర్తిస్థాయి సేవలు ఆరంభించిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకొని రికార్డును సృష్టించింది. డిసెంబర్ 2018 త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా విడుదల చేసిన నివేదికలో భారతీ ఎయిర్‌టెల్ 28.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ప్రకటించింది. అంటే టెలికం సేవలు ఆరంభించిన 19వ సంవత్సరం తర్వాత 30 కోట్ల మైలు రాయిని సాధించింది. జియో కేవలం రెండున్నరేండ్లలో ఈ ఘనతను సాధించడం విశేషం. విలీనం తర్వాత ఏర్పడిన వొడాఫోన్-ఐడియాలో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

2539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles