2 వేల నోటును రద్దు చేయండి

Sat,November 9, 2019 02:25 AM

-కేంద్రానికి మాజీ ఆర్థిక కార్యదర్శి ఎస్‌సీ గార్గ్
న్యూఢిల్లీ, నవంబర్ 8: రూ.2 వేల నోటును కూడా రద్దు చేయాలని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌సీ గార్గ్ అభిప్రాయపడ్డారు. నల్లధనాన్ని నిర్మూలించడానికి మూడేండ్ల క్రితం నరేంద్ర మోదీ సర్కార్ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిస్థానంలో కొత్తగా రూ.500 నోటుతోపాటు రూ.2,000 నోటును ప్రవేశపెట్టారు. వ్యవస్థలో నగదు చలామణి ఇంకా భారీగానే ఉన్నది.. రూ.2 వేల నోటును కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయి..ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ భారత్‌లో మాత్రం ఇది కాస్త నెమ్మదిగా ఉన్నది అని గార్గ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న నోట్లలో మూడోవంతు రూ.2 వేల నోట్లేనని ఆయన తెలిపారు. రోజువారి లావాదేవీలకు ఇవి అందుబాటులోకి రావడం లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యేలా చర్యలు తీసుకుంటే సరిపోతున్నదని గార్గ్ చెప్పారు. ఇది మేలైన మార్గమని, దీనివల్ల పెద్దగా ఇబ్బందులు కూడా తలెత్తవన్నారు.

943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles