రెండు నెలలుగా ఎంటీఎన్‌ఎల్‌లో జీతాల్లేవ్‌

Fri,September 6, 2019 12:40 AM

Salaries due for 2 months trying sincerely to release wages at earliest

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: నిధులు లేక సతమతమవుతున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ ఎంటీఎన్‌ఎల్‌..జీతాలు చెల్లించలేని స్థాయికి దిగజారింది. గడిచిన రెండు నెలలుగా సిబ్బందికి వేతనాలు చెల్లించలేదని, అయినప్పటికీ వీరికి ఎంత తొందర వీలైతే అంత తొందర్లో జీతాలు చెల్లించనున్నట్లు కంపెనీ సీఎండీ సునీల్‌ కుమార్‌ తెలిపారు. జూన్‌ వరకు పూర్తిస్థాయిలో వేతనాలను చెల్లించినట్లు, ఆ తర్వాతి రెండు నెలలు పెండింగ్‌లో ఉన్నట్లు ఇటీవల కంపెనీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కుమార్‌ వెల్లడించారు. ఎప్పటిలోగా చెల్లించే విషయంపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో ప్రభుత్వరంగ సంస్థలైన ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌లు నష్టాల్లోకి జారుకున్నాయి.

409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles