సామ్‌సంగ్ నోట్ 10, 10ప్లస్

Wed,August 21, 2019 04:36 AM

Samsung Galaxy Note 10 and Galaxy Note 10 Plus were formally launched in India

-ప్రీమియం సెగ్మెంట్‌లోకి సరికొత్త గెలాక్సీ ఫోన్లు
-ప్రారంభ ధర: రూ. 69,999

బెంగళూరు నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి: దేశీయ మార్కెట్‌కు గెలాక్సీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్లను సామ్‌సంగ్ పరిచయం చేసింది. మంగళవారం నోట్ 10, 10ప్లస్‌లను ముందుకు తెచ్చింది. బెంగళూరులోని ఒపెరాహౌస్‌లో సామ్‌సంగ్ నైరుతీ ఆసియా అధ్యక్షుడు, సీఈవో హెచ్‌సీ హంగ్ ఈ రెండు వేరియంట్లను ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి ఇవి వినియోగదారులకు అందుబాటులో ఉండనుండగా, నోట్ 10 ధర రూ. 69,999 గా, 10ప్లస్ ధర రూ.79,999గా ఉన్నాయి. ఈ సందర్భంగా హంగ్ మాట్లాడుతూ.. స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న సామ్‌సంగ్.. ఈ గెలాక్సీ నోట్ 10తో 65 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ఫోన్లలో ఎస్ పెన్‌తో సరికొత్త అనుభూతిని వినియోగదారులు పొందుతారని చెప్పా రు. 6.8 అంగుళాల స్క్రీన్ ఉన్న నోట్ 10ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో రెండు రకాలుండగా 12జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమరీతో ఒకటి, 12జీబీ ర్యామ్ 512జీబీ మెమరీతో మరొకటి ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 4,300 మెగాహెట్జ్. ఇక నోట్ 10లో స్క్రీన్ 6.3 అంగుళాలు, ర్యామ్ 8జీబీ, మెమరీ 256జీబీ ఉంటుంది. 3,500 మెగాహెట్జ్ బ్యాటరీ ఉన్నది. రెండింటిలోనూ ఓ 16 మెగాపిక్సల్, రెండు 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలున్నాయి. 10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలూ ఉన్నాయి. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డుపై కొనుగోలు చేసిన వారికి రూ.6 వేలు క్యాష్ బ్యాక్, ఆన్‌లైన్‌లో ఐసీఐసీఐ కస్టమర్లకు రూ.6 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. అదే విధంగా సామ్‌సంగ్ షోరూంలు, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు.

404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles