తొలి దశ ముగిసెన్..

Mon,August 19, 2019 03:25 AM

SBI, Canara Bank brainstorm on performance way ahead

-పనితీరుపై పూర్తయిన ప్రభుత్వ బ్యాంకుల సమాలోచనలు
న్యూఢిల్లీ, ఆగస్టు 18: పనితీరుపై ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహించిన రెండు రోజుల సమీక్షా సమావేశాలు ఆదివారం ముగిశాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ఐదేండ్లలో 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో భాగంగానే ఈ సమాలోచనలు జరిగా యి. జీడీపీని గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనల మేరకే బ్యాంకులు తొలి దశలో భాగంగా శని, ఆదివారాల్లో చర్చ లు నిర్వహించాయి. ఎస్బీఐ, పీఎన్‌బీ, బీవోబీ, కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఐవోబీ తదితర బ్యాంకులు రివ్యూల ను జరిపాయి. వృద్ధిరేటు బలోపేతానికి క్షేత్రస్థా యి నుంచి చర్యలు తీసుకోవాలని.. ప్రాంతాలవారీగా బ్రాంచ్ మేనేజర్లతో బ్యాంకులు ఈ సమావేశాలు ఏర్పాటు చేశాయి. వారి సమస్య లు, వ్యాపారాభివృద్ధికి వారిచ్చిన సలహాలను ఉన్నతాధికారులు తీసుకున్నారు. డిజిటల్ పే మెంట్ల పెంపు, మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు రుణ సదుపాయం, రిటైల్ లెండింగ్, వ్యవసాయ రుణాలు తదితర అంశాలే ఎంజెడాగా ఈ సమావేశాలు జరిగాయి.

ఎస్బీఐ...

SBI-GM
17 సర్కిళ్లలోగల 502 ప్రాంతీయ వ్యాపార కార్యాలయాల్లో ఎస్బీఐ సమావేశాలు జరిగాయి. 15 వేల మందికిపైగా అధికారులు ఇందులో పాల్గొన్నట్లు ఎస్బీఐ ఎండీ పీకే గుప్తా తెలిపారు. హైదరాబాద్ సర్కిల్‌లో బ్రాంచ్-రీజినల్ స్థాయిల్లో చర్చలు జరిగాయని, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రాంతీయ వ్యాపార కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించామని బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ ప్రాధాన్యాలు, వృద్ధిరేటు పురోగతి వంటి అంశాలపై సమాలోచనలు జరిగాయని పేర్కొన్నారు.

కెనరా బ్యాంక్....

ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు-సమస్యలపై చర్చించినట్లు ఓ ప్రకటనలో కెనరా బ్యాంక్ స్పష్టం చేసింది. వృద్ధిరేటు కోసం చేపట్టాల్సిన చర్యలు, వ్యాపార, పారిశ్రామిక, ఎంఎస్‌ఎంఈ, ఎగుమతులు, విద్య, వ్యవసాయ రంగాలకు రుణాల మంజూరు, ప్రభుత్వ రంగ పథకాలకు నిధులను సమకూర్చడం, డిజిటల్ లావాదేవీలకు ఊతం వంటి వాటిపై చర్చలు జరిగాయి.

ఓరియంటల్ బ్యాంక్...

శాఖల పనితీరు, రుణాల మంజూరులో ప్రాధాన్యతలు వంటి అంశాలపై చర్చించామని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) తెలియజేసింది. స్వచ్ఛ భారత్, మహిళా సాధికారత, ముద్ర రుణాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యతలపై అభిప్రాయాలను సేకరించామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నందన్ నీలేకనీ, ఉదయ్ కొటక్, యూకే సిన్హా, ఆదిత్యా పురి, చరణ్ సింగ్ వంటి ప్రముఖుల సూచనల అమలుపై చర్చించినట్లు వెల్లడించింది.

310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles