డబ్బును వృధా చేస్తున్నారు..

Sat,April 20, 2019 02:03 AM

SBI wasting Indian taxpayers money on UK legal fees

-ఎస్‌బీఐ బ్రిటన్ లీగల్ ఫీజు చెల్లింపులపై మాల్యా
లండన్, ఏప్రిల్ 19: సోషల్ మీడియా వేదికగా లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పన్నుల రూపంలో భారతీయులు చెల్లించిన డబ్బును బ్రిటన్‌లో లీగల్ ఫీజు చెల్లించడానికి వృధా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లండన్‌లో మాల్యాకు ఉన్న 2.60 లక్షల పౌండ్లు ఉన్న బ్యాంక్ ఖాతా జప్తు చేయాలని ఈడీ అభ్యర్థనను అక్కడి హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్ వేదికగా ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంపై ఆయన విమర్శలు గుప్పించారు. నాకు వ్యతిరేకంగా ఎస్‌బీఐ తరఫున వాదిస్తున్న లాయర్ బ్రిటన్‌లో ప్రత్యేక నివేదికను సమర్పించారని, ఇదంత పన్నుల రూపంలో వచ్చిన నిధులేనని.. తన నుంచి పూర్తి స్థాయిలో రుణాలను రివకరి చేశామని ప్రధానే స్వయంగా చెప్పాడు అని ట్విట్టర్ వేదికగా మాల్యా వెల్లడించారు.

1619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles