రూ.లక్ష కోట్ల పైమాటే!

Wed,May 15, 2019 02:30 AM

SBI wrote off loans worth Rs 1 lakh crore in past two years

గత రెండేండ్లలో ఎస్‌బీఐ రద్దు చేసిన రుణాలు
-పద్దు పుస్తకాల ప్రక్షాళనలో భాగంగానే

న్యూఢిల్లీ, మే 14: గత రెండేండ్లలో ఎస్‌బీఐ రద్దు చేసిన రుణాల విలువ లక్ష కోట్ల రూపాయలపైనే. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.40,809 కోట్లను రద్దు చేసిన ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం.. 2018-19లో రూ.61,663 కోట్లను మాఫీ చేయడం గమనార్హం. మొత్తం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.1.02 లక్షల కోట్ల మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)ను తొలగించింది. అంతకుముందు మూడు ఆర్థిక సంవత్సరాలను కలిపితే ఈ సంఖ్య రూ.1.60 లక్షల కోట్లను దాటుతున్నది. కాగా, పద్దు పుస్తకాల (లోన్‌ బుక్స్‌) ప్రక్షాళనలో భాగంగానే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇక ఈ స్థాయిలో మొండి పద్దుల రద్దు తర్వాత ఎస్‌బీఐ స్థూల ఎన్‌పీఏ.. 2018-19లో అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 23 శాతం క్షీణించాయి. రూ.1.72 లక్షల కోట్ల వద్ద నిలిచాయి. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.838.40 కోట్ల నికర లాభాన్ని ఎస్‌బీఐ పొందిన విషయం తెలిసిందే. నిరుడు ఇదే వ్యవధిలో ఏకంగా రూ.7,718.7 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీనికి కారణం మొండి బకాయిలే. ఈసారి కూడా ఎన్‌పీఏల తీవ్రత వల్లే అంచనాల్ని అందుకోలేకపోయింది.
Bad_loans
పెరిగిన వసూళ్లుమరోవైపు ఎస్‌బీఐ రుణాల వసూళ్లు, రుణాల అప్‌గ్రేడింగ్‌ గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.31,512 కోట్లను తాకింది. 2017 మార్చి 31తో ముగిసిన మూడేండ్ల కాలంలో రూ. 28,632 కోట్లుగా ఉన్నాయి. 2018-19, 2017-18ల్లో రూ.45,429 కోట్ల రుణాలను ఎస్‌బీఐ వసూలు చేసుకోగలిగింది. అంతకుముందు మూడు ఆర్థిక సంవత్సరాలతో కలిపితే రూ.96, 920 కోట్లకు చేరాయి. మొండి బకాయిలు ఎంతకీ వసూలు కాకపోతే బ్యాంకులు వాటిని రద్దు చేయడం చాలా ముఖ్యమని సంస్థాగత నిబంధనలే చెబుతున్నాయి. అలాకాని పక్షంలో లాభాలు తరిగిపోవడం, నష్టాలు మొదలవడం, బ్యాంక్‌ నైతిక ైస్థెర్యం దెబ్బతింటుందని, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలూ మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏదిఏమైనా సామాన్యులకు లక్ష రూపాయల రుణం ఇవ్వడానికి వంద రకాలుగా ఆలోచించే బ్యాంకులు.. బడా కార్పొరేట్ల మొండి బకాయిలను మాత్రం రద్దు చేస్తూ తేలిగ్గా తీసుకుంటున్నాయి.

3226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles