స్టాక్ మార్కెట్లపై సెబీ నిఘా

Mon,May 20, 2019 12:19 AM

SEBI office intelligence on stock markets

న్యూఢిల్లీ, మే 19: స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిఘాను విస్తృతం చేసింది. ఈ వారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రానున్న క్రమంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా స్టాక్ ఎక్సేంజ్‌లపై కన్నేసింది. ఆదివారం తుది విడుత ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్‌పోల్స్ విడుదలైన విషయం తెలిసిందే. వీటి మధ్య సోమవారం ట్రేడింగ్ సరళి ఎలా ఉంటుంది?, ఏవైనా అక్రమాలకు అవకాశం ఉందా? అన్నదానిపై ముందే అప్రమత్తమైన సెబీ.. నిఘాను కట్టుదిట్టం చేసింది. లేనిపోని పుకార్లతో మార్కెట్లను ఒడిదుడుకులకు లోనుచేసే వీలుండటంతో ఆ దిశగా సెబీ దృష్టి పెట్టింది. అమాయక మదుపరులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు చేపట్టింది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానుండగా, అప్పటిదాకా నిఘాను పెడుతామని సెబీ వర్గాలు చెబుతున్నాయి. సింగపూర్ ఎక్సేంజ్‌పై నిఫ్టీ ఫ్యూచర్ కదలికలనూ గమనిస్తున్నామని తెలిపాయి. ఎగ్జిట్‌పోల్స్‌కు ముందే కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందన్న అంచనాల మధ్య శుక్రవారం ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్న విషయం తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 537 పాయింట్లు లాభపడగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 11,400 పాయింట్ల స్థాయిని అధిగమించిన సంగతీ విదితమే. దీంతో సోమవారం కూడా ఇలాంటి ఊహాగానాలను అక్రమార్కులు క్యాష్ చేసుకోకుండా సెబీ తగిన చర్యలు తీసుకుంటున్నది.

322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles