అమ్మకాల ఒత్తిడి

Wed,August 14, 2019 03:37 AM

Sensex crashes 624 points and Nifty ends below 184 points

-సెన్సెక్స్ 624
-నిఫ్టీ 184 పాయింట్లు పతనం
-అంతర్జాతీయ ప్రతికూలతలే కారణం

ముంబై, ఆగస్టు 13: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలకు లోనైయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు దేశీయ ప్రతికూల పరిణామాలు కూడా తోడవడంతో సూచీలు కుప్పకూలాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్ 623.75 పాయింట్లు లేదా 1.66 శాతం పతనమై 36,958.16 వద్ద ముగియగా, గడిచిన నెల రోజులకుపైగా కాలంలో ఒక్కరోజే సెన్సెక్స్ ఈ స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 183.80 పాయింట్లు లేదా 1.65 శాతం కోల్పోయి 10,925.85 వద్ద నిలిచింది. ఇక ఒకానొక దశలో సెన్సెక్స్ 36,888.49 పాయింట్లు, నిఫ్టీ 10,901.60 పాయింట్ల కనిష్ఠానికి దిగజారాయి. చివరకు జియో వెలుగు జిలుగులూ మార్కెట్లను నిలబెట్టలేకపోయాయి. అయితే ఆ సంస్థ షేర్ విలువ మాత్రం విపరీతంగా పుంజకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఒకసారి 37,755.16 పాయింట్లు, నిఫ్టీ 11,145.90 పాయింట్లకు పెరిగాయి.

కానీ ఈ ఆనందం చివరిదాకా కొనసాగలేదు. దీంతో భీకర నష్టాలు తప్పలేదు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, హాంకాంగ్ నిరసనలు, అర్జెంటీనా కరెన్సీ నష్టాలు మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. వీటికితోడు దేశీయంగా కనిపిస్తున్న స్థూల ఆర్థిక సవాళ్లు, వివిధ రంగాల్లో పడిపోతున్న కన్జ్యూమర్ డిమాండ్ కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆటో అమ్మకాల క్షీణత, నిర్మాణ రంగంలో నిస్తేజం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల సంక్షోభం మంగళవారం ట్రేడింగ్‌ను ప్రభావితం చేశాయి. గత నెల జూలైలోనూ ఆటోమొబైల్ అమ్మకాలు నిరాశపరుచగా, దాదాపు 19 ఏండ్ల కనిష్ఠానికి పడిపోవడం మదుపరులకు ఏమాత్రం రుచించలేదని నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.

ఆసియా, ఐరోపా మార్కెట్లు ఢమాల్

ఆసియా దేశాల్లోని ప్రధాన సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. హాంకాంగ్ 2.10 శాతం, జపాన్ 1.11 శాతం, దక్షిణ కొరియా 0.85 శాతం, చైనా 0.63 శాతం చొప్పున క్షీణించాయి. ఐరోపా మార్కెట్లూ పడిపోగా, కీలకమైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కదలాడుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం భయాలు, అర్జెంటీనా కరెన్సీ కష్టాలు, హాంకాంగ్ నిరసనలు.. గ్లోబల్ మార్కెట్లను నష్టపరిచాయి అని సెంట్రమ్ బ్రోకింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు, రిసెర్చ్ అధిపతి (వెల్త్) జగన్నాథం తునుగుంట్ల అభిప్రాయపడ్డారు.

6 నెలల కనిష్ఠానికి రూపాయి

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో దాదాపు 6 నెలల కనిష్ఠానికి దిగజారింది. 62 పైసలు పడిపోయి 71.40 వద్ద స్థిరపడింది. అర్జెంటీనా కరెన్సీ భారీ పతనంతో మదుపరులు ఒక్కసారిగా రక్షణాత్మక చర్యలను పాటించారు. దీంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయి అమ్మకాకూడా స్వల్పంగా నష్టపోయి 70.78 వద్ద ముగియగా, ఈ రెండు రోజుల్లో 71 పైసలు నష్టపోయింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు కూడా రూపాయి విలువను ప్రభావితం చేశాయని మార్కెట్ నిపుణులు చెప్పారు.

దిగ్గజ షేర్లన్నీ డీలాటెలికం, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్స్, టెక్నాలజీ, విద్యుత్, ఇండస్ట్రియల్స్, ఐటీ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో 4.34 శాతం మేర నష్టాలను చవిచూశాయి. యెస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ షేర్లు 10.35 శాతం మేర విలువను కోల్పోయాయి. అయితే ఇంధన, చమురు, గ్యాస్ సూచీలు 5.98 శాతం వరకు లాభపడగా, సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్ షేర్లు ఆకర్షణీయ లాభాలను పొందాయి. బీఎస్‌ఈ మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 2.25 శాతం వరకు పెరిగాయి.

రూ.2.21 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలు మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరి చేసేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 624 పాయిం ట్లు పతనమైన నేపథ్యంలో అందులోని సంస్థల షేర్ల విలువ రూ.2.21 లక్షల కోట్లకుపైగా కరిగిపోయింది. మెజారిటీ హెవీ వెయిట్ షేర్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోను కావడంతో రూ.2,21,837.81 కోట్ల మేర మదుపరుల సంపద కనుమరుగైపోయింది. దీంతో బీఎస్‌ఈ సంస్థల మార్కె ట్ విలువ రూ.1,39,46,997.40 కోట్లకు పరిమితమైంది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో 27 షేర్లు భారీ నష్టాల్లోనే ముగిశాయి. ఇక బీఎస్‌ఈలో 1,652 షేర్లు నష్టపోగా, 861 షేర్లు లాభపడ్డాయి. 148 షేర్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి.

ril

10% ఎగిసిన రిలయన్స్ షేర్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) షేర్ విలువ సుమారు 10 శాతం ఎగబాకింది. బీఎస్‌ఈలో 9.72 శాతం పుంజుకుని రూ.1,275 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈలో 9.74 శాతం అందుకుని రూ.1,275.30 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలోనైతే సెన్సెక్స్‌లో 12.09 శాతం ఎగబాకి రూ.1,302.50 వద్దకు చేరింది. దీంతో ఈ ఒక్కరోజే సంస్థ మార్కెట్ విలువ బీఎస్‌ఈలో రూ. 71,637.78 కోట్లు ఎగిసి రూ. 8,08,233.78 కోట్లను తాకింది. సోమవారం జరిగిన సంస్థ 42వ వార్షిక సాధారణ సమావేశంలో జియో ఫైబర్ ప్రకటన, ఆఫర్లు మదుపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles