దలాల్‌స్ట్రీట్‌లో కొనుగోళ్ల వర్షం

Wed,April 17, 2019 12:53 AM

Sensex rallies 370 Points

-నూతన శిఖరాలకు సూచీలు
-370 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ముంబై, ఏప్రిల్ 16: స్టాక్ మార్కెట్లు మరో నూత న శిఖరాలకు చేరుకున్నాయి. ఈ ఏడాది సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల ఆశావాదంగా ఉండటం దలాల్ స్ట్రీట్‌లో కొనుగోళ్ల వర్షం కురిసింది. వచ్చే సమీక్షలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించనున్నదన్న అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు శాంతించడం, బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి వచ్చిన స్పందనతో వరుసగా నాలుగు రోజు కూడా భారీగా లాభపడింది. ప్రారంభం నుంచి లాభాల బాట పట్టిన సూచీలు ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 39,040 పా యింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సె క్స్..ఇంట్రాడేలో 39,364 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 369.80 పాయింట్లు లాభపడి 39,275.64 వద్ద ముగిసింది. దీంతో చారిత్రక గరిష్ఠ స్థాయిలో ముగిసినట్లు అయింది. గడిచిన నాలుగు సెషన్లలో సూచీ 690.29 పాయింట్లు లాభపడింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 11,800 పాయింట్ల మార్క్‌ను దాటింది. చివరకు 96.80 లాభపడి 11, 787.15 వద్ద స్థిరపడింది. రెండు సూచీలకు ఇదే గరిష్ఠ స్థాయి.

ఆర్థిక రంగ షేర్లకు భలే డిమాండ్

ఆర్థిక సేవల షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించడంతో సూచీలు మరింత పరుగులు పెట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ 3.58 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 3.96 శాతం, ఓఎన్‌జీసీ, లార్సెన్ అండ్ టుబ్రో, మారుతి, ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్‌లు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు పవర్‌గ్రిడ్, టాటా మోటర్స్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రం తగ్గుముఖం పట్టాయి. అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో టీసీఎస్ షేరు ధర ఆరు శాతానికి పైగా లాభపడింది. రంగాల వారీగాచూస్తే బీఎస్‌ఈ బ్యాంకెక్స్ 1.62 శాతం లాభపడగా, ఫైనాన్స్ 1.08 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.16 శాతం, టెలికం 1.03 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ల షేర్లు అంచనాలకుమించి పెరుగుదల నమోదు చేసుకోవడం సూచీలకు మరింత జోష్‌నిచ్చిందని మార్కెట్ పండితులు అంచనావేస్తున్నారు. అయినప్పటికీ 1,298 స్టాకులు పతనమవగా, 1,277 షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు కార్పొరేట్ల ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో సూచీలు మరో ఆల్‌టైం హైకీ చేరుకున్నాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దేశీయ మార్కెట్లకు తోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగింది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలకు చెందిన స్టాక్ మార్కె ట్లు లాభాల బాట పట్టాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 0.11 శాతం తగ్గి 71.10 డాలర్లకు పడిపోవడం సూచీల్లో జోష్ పెంచింది.

నేడు మార్కెట్లకు సెలవు

మహవీర్ జయంతి సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లు మూసివేసి వుంచనున్నారు. ఫారెక్స్, కమోడిటీ, బులియన్ మార్కెట్లలో లావాదేవీలు కూడా నిలిచిపోనున్నాయి. గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు నిలిచిపోనున్నాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ మూడు రోజులకు పరిమితమైంది.

రూపాయి 18 పైసలు పతనం

దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అగ్రరాజ్యం అమెరికా కరెన్సీని కొనుగోలు చేయడానికి దిగుమతిదారులు, బ్యాంకర్లు మొగ్గుచూపడంతో ఇతర కరెన్సీలు దిగువకు పడిపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 18 పైసలు తగ్గి రూ.69.60కి జారుకున్నది. గడిచిన మూడు రోజుల్లో రూపాయి విలువ 68 పైసలు పతనం చెందింది. అయినప్పటికీ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా నిధులు కుమ్మరించారు.

674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles