వెండి @ 45,000

Wed,August 14, 2019 12:15 AM

Silver touches all time high mark of Rs 45,000

-ఒకేరోజు రూ.2 వేలు పెరిగిన కిలో
-రూ.100 తగ్గిన పసిడి ధర

న్యూఢిల్లీ, ఆగస్టు 13: వెండి ధరలు భగ్గుమన్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ధర ఏకంగా రూ.2,000 ఎగబాకి రూ.45 వేల మార్క్‌కు చేరుకున్నది. ఈ గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. వెండి భారీగా పుంజుకున్నప్పటికీ బంగారం మాత్రం స్వల్పంగా తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.38,370 వద్ద ముగిసినట్లు ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది. పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారులతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన డిమాండ్‌తో ఒక్కసారిగా వెండి గరిష్ఠ స్థాయికి ఎగబాకిందని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురేంద్ర జైన్‌ తెలిపారు. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,520.37 డాలర్ల వద్ద కొనసాగగా, వెండి 17.32 డాలర్లకు ఎగబాకింది.

390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles