కుదేలైన చిన్న స్టాకులు

Wed,September 11, 2019 02:28 AM

Small stocks take big hit, tank up to 15.42 Percentage  so far in FY20

- 2019-20లో ఇప్పటివరకు 15 శాతం పతనం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: చిన్న స్టాకులు కుదేలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లో చిన్న స్థాకులు 15.42 శాతం వరకు నష్టపోయాయి. బ్లూచిప్ షేర్ల కంటే స్మాల్ స్టాక్ షేర్లు భారీగా పతనం చెందాయి. ఎస్‌అండ్ పీ బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2,317.40 పాయింట్లు (15.42 శాతం) మేర పడిపోగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1,985 పాయింట్లు లేదా 12.82 శాతం పతనం చెందాయి. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 9 వరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,527.46 పాయింట్లు లేదా 3.94 శాతం తగ్గింది. గత నెల 23న మిడ్‌క్యాప్ ఇండెక్స్ 52 వారాల కనిష్ఠ స్థాయి 12,914.63 పాయింట్లకు జారుకోగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ కూడా 11,950.86 పాయింట్లకు తగ్గింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు, సంపన్నవర్గాలపై అధిక పన్ను విధించడం, ఆటోమొబైల్ రంగంలో నెలకొన్న మందకొడి పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో మొత్తం ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు వెల్లడించారు.

281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles