తొలి గ్రీన్‌ఫీల్డ్

Sun,September 8, 2019 02:58 AM

Smart Industrial City launched in Aurangabad

-స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఔరంగబాద్‌లో ప్రారంభించిన
-ప్రధాని నరేంద్ర మోదీ రూ.70 వేల కోట్ల పెట్టుబడులపై ఆశాభావం
ఔరంగబాద్, సెప్టెంబర్ 7: దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ ఆరిక్ సిటీని ఇక్కడి షేంద్ర పారిశ్రామిక వాడ వద్ద ఏర్పాటు చేస్తుండగా, ఇది పూర్తయితే రూ.60 వేల కోట్ల నుంచి 70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలదన్న అంచనాలున్నాయి. అలాగే త్వరలో రాబోయే ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా మహారాష్ట్రలోని మరాఠవాడ ప్రాంతంలో కొలువుదీరుతున్న ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీతో వెనుకబడిన ఈ చారిత్రక ప్రాంతమంతా కూడా అభివృద్ధి చెందగలదన్న విశ్వాసాన్ని కేంద్రం కనబరుస్తున్నది.

ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ స్మార్ట్ సిటీ ప్రధాన పరిపాలనా కేంద్రం ఆరిక్ హాల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన మోదీ.. భారతీయ పారిశ్రామిక కార్యకలాపాల్లో ఈ ఇండస్ట్రియల్ సిటీ కేంద్రం కాగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. తమ ప్రభుత్వం దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తున్నదని, అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని చెప్పారు. 2022 నాటికి ప్రతీ ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేస్తామని, ఇప్పటికే 180 లక్షల ఇండ్లను పూర్తి చేశామని వివరించారు. ఇదిలావుంటే స్కోడా ఆటో, సీమెన్స్, జాన్సన్ అండ్ జాన్సన్, పెర్కిన్స్, లీబెర్ వంటి అంతర్జాతీయ సంస్థలు, లుపిన్, బజాజ్, క్రాంప్టన్ గ్రీవ్స్, వోక్‌హార్డ్ వంటి దేశీయ సంస్థలు ఆరిక్ సిటీ సమీపంలో ఉత్పత్తిని చేస్తున్నాయి.

383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles