మహిళల భద్రతకు ప్రత్యేక యాప్

Mon,April 15, 2019 01:02 AM

-సంయుక్తంగా విడుదల చేసిన ఎయిర్‌టెల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ అందుబాటులోకి వచ్చింది. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఈ చిఫ్‌ను రూపొందించింది. మై సర్కిల్ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో.. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అత్యవసర సమయంలో ఎస్‌వోఎస్ అలర్ట్ మేసేజ్‌ను సెండ్ చేస్తే సరిపోతుంది. ఈ యాప్‌ను ఎయిర్‌టెల్ వినియోగదారులతోపాటు ఇతర టెలికం కంపెనీల వినియోగదారులూ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎస్‌వోఎస్ అలర్ట్ మేసేజ్‌లో మహిళలు తమ ఇబ్బందుల గురించి వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు 13 భాషల్లో పంపుకోవచ్చు. ఇలా ఐదుగురికి సమాచారం ఇవ్వొచ్చు. మెసేజ్ అందుకున్నవారు అలర్ట్ అయి వీలై నంత తొందరగా బాధితుల్ని చేరుకోవడానికి వీలుంటుంది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, తమి ళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠి, పంజాబీ, బంగ్లా, ఉర్దు, ఒరియా, గుజరాతీ భాషల్లో సందేశాలను పంపుకునే వీలుంటుంది.

ఒక్క బటన్‌తోనే ఈ ఎస్‌వోఎస్ అలర్ట్‌ను పంపుకునే అవకాశం ఎయిర్‌టెల్ కల్పించింది. అలాగే వాయిస్ కమాండ్‌ను ఎంపిక చేసుకునే పెసులుబాటు కూడా ఉన్నది. త్వరలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ కలిగిన ప్రతి స్మార్ట్‌ఫోన్లో ఉండే గూగుల్ యాక్టివేషన్ ద్వారా వాయిస్‌ను పంపుకునే వీలు రానున్నది. ఈ యాప్ ద్వారా వారు ఉన్న స్థలం, ఇతర వివరాలను కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలుసుకునే అవకాశమున్నది. ఉచితంగా లభించే ఈ యాప్.. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ (ఆండ్రాయిడ్)లో లభిస్తుండగా, త్వరలో యాప్ స్టోర్ (ఐవోఎస్)లో కూడా లభించనున్నది. మహిళలకు మరింత భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు, మహిళా సాధికారిత సాధించడంతోపాటు వారిని అత్యవసర సమయంలో ఆదుకునే విధంగా డిజైన్ చేసినట్లు గ్లోబల్ సీఐవో, ఎయిర్‌టెల్ హెడ్ హర్మీన్ మెహతా ఈ సందర్భంగా తెలిపారు.

1258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles