ఏడాదిన్నరలోగా 25 శాఖలు

Wed,April 24, 2019 12:03 AM

Suryoday Small Finance Bank starts operations in Hyderabad

-తెలుగు రాష్ర్టాల్లో ఏర్పాటు చేయనున్న సూర్యోదై స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
-హైదరాబాద్‌లో తొలి శాఖను ప్రారంభించిన సంస్థ

హైదరాబాద్, ఏప్రిల్ 23: మహారాష్ట్రకు చెందిన సూక్ష్మ రుణాలు అందించే సూర్యోదై స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ).. హైదరాబాద్‌లో తన తొలి శాఖను మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో భాస్కర్ బాబు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఆర్థికంగా చేయూతనందించడానికి పదేండ్ల క్రితం ఫైనాన్స్ సేవలు ప్రారంభించిన తమ సంస్థకు రెండేండ్ల క్రితం ఆర్బీఐ చిన్న స్థాయి బ్యాంకుల లైసెన్స్‌ను జారీ చేసిందని, దీంతో ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ర్టాల్లో 100 శాఖలను ప్రారంభించినట్లు చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఏడాదిన్నరలోగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో 25 శాఖలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వీటిలో హైదరాబాద్‌లోనే ఐదు శాఖలను ప్రారంభించనున్న సంస్థ.. మిగతావి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అలాగే నాలుగు రాష్ర్టాల్లో ఉన్న 270 సూక్ష్మ రుణ శాఖలను కూడా బ్యాంకులుగా మార్చే ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్లపై 9 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది. 2018-19లో రూ.100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సంస్థలో 4 వేల మంది సిబ్బంది ఉండగా, వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్యను 5 వేలకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు.

819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles