టిగోర్ ఈవీలో సరికొత్త వెర్షన్

Thu,October 10, 2019 01:15 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్..ఎలక్ట్రిక్ వాహన పరిధిని మరింత విస్తరించుకోవడంలో భాగంగా టిగోర్ ఈవీని సరికొత్తగా విడుదల చేసింది. వ్యక్తిగతంగా ఉపయోగపడే విధంగా రూపొందించిన ఈ కారు ధర రూ.9.44 లక్షలుగా నిర్ణయించింది(ఢిల్లీ షోరూం ధరలు). ఫేమ్-2 నిబంధనలకు లోబడి కమర్షియల్‌గా ఉపయోగిస్తే ఈ కారుపై ప్రత్యేక రాయితీలు పొందవచ్చును. మూడు రకాల్లో రూపొందించిన ఈ కారు దేశవ్యాప్తంగా 30 నగరాల్లో లభించనున్నదని కంపెనీ ఎలక్ట్రిక్ వాహన బిజినెస్ హశ్రీడ్ అశేష్ ధార్ తెలిపారు. గతంలో ఒక్క రీచార్జికి 142 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వనుండగా, ఈ సరికొత్త వాహనం 214 కిలోమీటర్లు ఇవ్వనున్నది.


249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles