మాపై భారీగా పన్నులు

Thu,April 18, 2019 12:34 AM

Taxes on telecom similar to non essential items like liquor cigarette

-వొడాఫోన్ ఐడియా సీఈవో
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: లిక్కర్, సిగరెట్లపై మాదిరిగానే టెలికం సంస్థలపై కూడా భారీ పన్నులు విధిస్తున్నారని వొడాఫోన్-ఐడియా వర్గాలు ఆరోపించాయి. టెలికం సంస్థలపై కస్టమ్స్ డ్యూటీ కింద 23 శాతం, జీఎస్టీ కింద 18 శాతం విధించడం భావ్యం కాదని, ప్రాధాన్యేతర వస్తువులైన లిక్కర్ లేదా సిగరెట్లపై విధిస్తున్న పన్ను తరహాలో విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తున్నదని వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేష్ శర్మ తెలిపారు. భారత్‌లో టెలికం సేవలు అందించడానికి స్పెక్ట్రంకోసం భారీ స్థాయిలో నిధులు వెచ్చించాల్సిరావడంతో అప్పులు పాలయ్యామని, వీటితోపాటు స్పెక్ట్రం యూసేజ్ చార్జీలు, యూఎస్‌వోఎఫ్ చార్జీలని, ఇతర చార్జీలను టెలికం సంస్థలపై కేంద్రం భారీగా వడ్డిస్తున్నదని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం వొడాఫోన్-ఐడియాకు రూ.1.2 లక్షల కోట్ల అప్పు ఉన్నది. వీటిలో 80 శాతం స్పెక్ట్రంకు సంబంధించిన చెల్లింపులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియాపై ఆయన విమర్శలు గుప్పించారు. ముందుగా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచిన తర్వాతనే డిజిటల్ ఇండియా బాట పట్టాలని ఆయన సూచించారు. టెలికం సంస్థల మధ్య నెలకొన్న పోటీ కారణంగా టారిఫ్‌లు తగ్గిపోయాయని, దీంతో ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపుతుందన్నారు.

1100
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles