ఆరు నెలల్లో వెయ్యి మెగావాట్లు

Thu,April 18, 2019 12:38 AM

Telangana to add 1,000 MW solar power capacity in 6 8 months

-రాష్ట్రంలో అందుబాటులోకిరానున్న సోలార్ విద్యుత్
-టీఎస్‌రెడ్కో ఎండీ ఎన్ జానయ్య
హైదరాబాద్, ఏప్రిల్ 17: సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం దూసుకుపోతున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలలకాలంలో మరో వెయ్యి మెగావాట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్‌రెడ్కో) వైస్-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ జానయ్య తెలిపారు. దీంతో మొత్తం విద్యుత్ ఉత్పత్తి 4,500 మెగావాట్లకు చేరుకోనున్నదన్నారు. రాష్ట్రంలో 20.41 గిగావాట్ల సౌర విద్యుత్, 4.2 గిగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌లో జరిగిన రెన్యూఎక్స్-2019 కార్యక్రమంలో ఆయన చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 4,036 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, 2024 నాటికి ఇది 5,500 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నదన్నారు. వీటిలో 3,583 మెగావాట్ల సౌర విద్యుత్ కాగా, మిగతా 128 మెగావాట్లు పవన విద్యుత్. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రంలో 2 మెగావాట్ల సోలార్ రూఫ్‌టాప్‌లు ఉండగా, ప్రస్తుతం ఇది 60 మెగావాట్లకు చేరుకున్నాయని, మరో 40 మెగావాట్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇవి కూడా ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, ముఖ్యంగా కుసుం స్కీం కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి దోహదపడిందన్నారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం రెండోస్థానంలో ఉండగా, మొదటి స్థానంలో కర్ణాటక ఉన్నదని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ నెల 26 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రెన్యూవబుల్ ఎనర్జీ ట్రేడ్ ఎక్స్‌పో జరుగుతున్నది.

862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles