ఎయిర్ ఇండియాకు ఊరట

Sat,September 7, 2019 02:45 AM

The firms had also threatened to stop supply at Hyderabad and Raipur airports

-హైదరాబాద్, రాయిపూర్ విమానాశ్రయంలో ఇంధన సరఫరా పునరుద్ధరణ

ముంబై, సెప్టెంబర్ 6: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు ఊరట లభించింది. బకాయిలు చెల్లించకపోవడంతో హైదరాబాద్, రాయిపూర్ విమానాశ్రయాల్లో ఇంధన సరఫరాను నిలిపివేసిన చమురు మార్కెటింగ్ కంపెనీలు మళ్లీ పునరుద్ధరించాయి. ప్రభుత్వరంగ ఇంధన విక్రయం ఇండియన్ ఆయిల్ కంపెనీకి భారీగా బకాయి పడటంతో ఈ రెండు విమానాశ్రయాలతోపాటు పుణె, వైజాగ్, పాట్నా, రాంచీ విమానాశ్రయాల్లో ఇంధన సరఫరాను నిలిపివేసింది. ఈ రెండు విమానాశ్రయాల్లో ఇంధన సరఫరా కొనసాగనుండగా, మిగతా ఆరు ఎయిర్‌పోర్ట్‌లలో నిషేధం కొనసాగుతున్నదని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. నిధులు లేక సతమతమవుతున్న ఎయిర్ ఇండియా ప్రతిరోజు ఇంధనం కోసం రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ 90 రోజుల పాటు ఇంధన విక్రయ సంస్థలు ఎయిర్ ఇండియాకు గడువు ఇచ్చినప్పటికీ ఎలాంటి చెల్లింపులు జరుపకపోవడంతో నిషేధం విధించాయి. మార్చి నాటికి రూ.4,600 కోట్లుగా ఉన్న కంపెనీ ఇంధన బకాయిలు..జూలై చివరి నాటికి రూ.4,300 కోట్లకు తగ్గాయి.

281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles