పెండ్లి వేడుకకు వచ్చిన చిన్నారి హత్య

Sat,November 9, 2019 12:50 AM

-ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తల్లిదండ్రులతో కలిసి బంధువుల పెండ్లి వేడుకకు వచ్చిన ఆరేండ్ల చిన్నారి గుర్తు తెలియని వ్యక్తుల చేతు ల్లో హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా కొరబలకోట మండలం చేనేతనగర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. స్థానిక కల్యాణ మండపంలో వివాహానికి వచ్చిన చిన్నారి వర్షిత(6) గురువారం రాత్రి సమయంలో కనిపించకుండా పోయింది. కూతురి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు చిన్నారి శవం కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనాస్థలి వద్ద పోలీసు డాగ్ స్కాడ్ తనిఖీలు నిర్వహించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles