ఇక ఏడాదికి మూడుసార్లు చమురుబావుల వేలం!

Mon,August 19, 2019 03:16 AM

Three times a year oil bids

న్యూఢిల్లీ, ఆగస్టు 18: చమురు బావుల వేలం ఆలస్యమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏడాది జరిగే వేలం ప్రక్రియను రెండు నుంచి మూడు వరకు పెంచడానికి సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 28 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతాల్లో చమురును గుర్తించిన కేంద్రం..వీటిని గడిచిన మూడేండ్లుగా వేలం వేస్తున్నది. ప్రస్తుతానికి ఏడాదిలో ఎప్పుడైన రెండుసార్లు చమురు బావులను వేలం వేస్తుండగా, వచ్చే ఏడాది నుంచి ఇది మూడుకు చేరుకోనున్నది.

దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సంస్కరణల ఎజెండాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, అలాగే సులభతర వాణిజ్య విధానంలో భారత ర్యాంక్ మెరుగుపడిన నేపథ్యంలో ఈ వేలాన్ని రెండు నుంచి మూడుకు పెంచాలని నిర్ణయించినట్లు డీజీహెచ్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. గతంలో మే 15న మొదటిసారి, నవంబర్ 15న రెండోసారి వేలం వేసేవారు. ఈవోఐ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి జూలై 31లోగా మొదటిసారి, ఆగస్టు 1 నుంచి నవంబర్ 30లోగా రెండోసారి, డిసెంబర్ 31 నుంచి మార్చి 31లోగా మూడోసారి వేలం వేయనున్నారు. గతంలో నిర్వహించిన వేలంలో 87 బావులు ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు చేజిక్కించుకున్నాయి. చమురు దిగుమతులను 10 శాతం తగ్గించుకోవాలని చూస్తున్న మోదీ సర్కార్.. 2022 నాటికి 67 శాతానికి, 2030 నాటికి 50 శాతానికి కట్టడి చేయాలనుకుంటున్నది.

237
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles