31 మంది డీఎస్పీల బదిలీ

Sat,November 9, 2019 12:52 AM

-డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా 31 మంది డీఎస్పీలను బదిలీచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ చీఫ్ ఆఫీస్‌లో వెయింటింగ్‌లో ఉన్న డీఎస్పీలకు పలుచోట్ల పోస్టింగ్‌లు ఇచ్చారు. వెయింటింగ్‌లో ఎస్ మహేశ్వర్ రామగుండం సీసీఎస్ డీఎస్పీగా, కే నర్సింగరావు సైబరాబాద్ క్రైం డీఎస్పీగా, బైరు భాస్కర్ హైదరాబాద్ ఎస్బీ డీఎస్పీగా, నయీముద్దీన్ జావెద్ రాచకొండ ఎస్బీ డీఎస్పీగా, పీ కృపాకర్ సిరిసిల్ల 17వ బెటాలియన్ డీఎస్పీగా, డీ ప్రసన్నకుమార్ నాగర్‌కర్నూల్ డీఎస్పీ(అడ్మిన్)గా, ఏ రాంరెడ్డి రామగుండం ట్రాఫిక్ డీఎస్పీగా, అందె రాములు హైదరాబాద్ సీఐడీ డీఎస్పీగా, ఎం సుదర్శన్ కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీగా, ఏ యాదగిరి సిద్దిపేట సీసీఎస్ డీఎస్పీగా, కే ప్రసాద్ ఖమ్మం సీటీసీ డీఎస్పీగా, వీ బాలుజాదవ్ నిజామాబాద్ సీటీసీ డీఎస్పీగా, పీ బాలరాజు బాసర రాజీవ్ వర్సిటీ డీఎస్పీగా, వై వెంకట్‌రెడ్డి హైదరాబాద్ సీసీఎస్ డీఎస్పీగా, ఖాజా మొయినుద్దీన్ జెన్‌కో డీఎస్పీగా, ఎన్ సైదులు మహబూబ్‌నగర్ ఎస్బీ డీఎస్పీగా, ఎం సోమనందం కరీంనగర్ ట్రాఫిక్ డీఎస్పీగా, జీ వెంకటరమణారెడ్డి నల్లగొండ ఎస్బీ డీఎస్పీగా, జీ శంకర్‌రాజు కరీంనగర్ ట్రాఫిక్ డీఎస్పీగా, ఏ శ్రీనివాసులు కరీంనగర్ పీటీసీ డీఎస్పీగా, కే రాజేందర్ హైదరాబాద్ ఎక్సైజ్ డీఎస్పీగా, సంకిరెడ్డి భీంరెడ్డి హైదరాబాద్ హెచ్‌ఎంఆర్‌ఎల్ డీఎస్పీగా, కే శ్రీనివాసరావు నిజామాబాద్ ఎస్బీ డీఎస్పీగా, కే ఉమామహేశ్వర్‌రావు రాజన్న సిరిసిల్ల ఎస్బీ డీఎస్పీగా, రాజన్న సిరిసిల్ల ఎస్బీ డీఎస్పీ కే నరహరి సైబరాబాద్ సీఐ సెల్ ఏసీపీగా, జే వేణుగోపాల్ హైదరాబాద్ సీసీఎస్ డీఎస్పీగా, ఎన్ రమణరావు జగిత్యాల ఎస్బీ డీఎస్పీగా, కే రమేశ్ వరంగల్ మమ్నూర్ నాలుగో బెటాలియన్ డీఎస్పీగా, పీ సాంబయ్య వరంగల్ సీటీసీ డీఎస్పీగా, వరంగల్ సీటీసీ ఏసీపీ శ్యాంసుందర్‌సింగ్ హైదరాబాద్ డీడీగా, అసిస్టెంట్ కమాండెంట్ కే వెంకటేశ్వర్లు హైదరాబాద్ సీటీసీ డీఎస్పీగా బదిలీ అయ్యారు.

186
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles