వడ్డీరేట్లను తగ్గించిన యూబీఐ

Thu,April 18, 2019 12:17 AM

United Bank of India cuts MCLR by 5 basis points

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ప్రభుత్వరంగ సంస్థ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీ ఐ).. ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నూతన వడ్డీరేట్లు గురువారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.85 శాతం నుంచి 8.80 శాతానికి తగ్గాయి. వీటితోపాటు ఆరు, మూడు నెలల రుణాలపై వడ్డీని కూడా వరుసగా 8.60 శాతానికి, 8.50 శాతానికి తగ్గించింది బ్యాంక్. అలాగే నెల, ఒక్కరోజు రుణాలపై కూడా వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు కోత విధించింది.

767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles