వేదాంత లాభం 2,158 కోట్లు

Fri,November 15, 2019 02:51 AM

న్యూఢిల్లీ, నవంబర్ 14: మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్ నాయకత్వంలో నడుస్తున్న వేదాంతా లిమిటెడ్ లాభాల్లో దూసుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,158 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,343 కోట్ల లాభంతో పోలిస్తే 60.6 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ విషయాన్ని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.23,279 కోట్ల నుంచి రూ.22,814 కోట్లకు పడిపోయినట్లు వెల్లడించింది. కర్ణాటకలో ఉత్పత్తైన ఖనిజ అమ్మకాలు భారీగా పుంజుకున్నప్పటికీ కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆదాయం తగ్గుముఖం పట్టిందని వేదాంతా సీఈవో శ్రీనివాసన్ వెంకటకృష్ణన్ తెలిపారు. గత త్రైమాసికంలో సంస్థ రూ.8,322 కోట్ల అప్పులను తగ్గించుకోగా..అలాగే ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.35,817 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. జింక్, ఖనిజ ఉత్పత్తి మూడు శాతం పెరిగి 36 లక్షల టన్నులకు చేరుకున్నది.

170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles