మూడున్నరేండ్ల కనిష్ఠానికి టోకు సూచీ

Fri,November 15, 2019 02:51 AM

న్యూఢిల్లీ, నవంబర్ 14: టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రం మరింత పడిపోయింది. తయారీరంగ వస్తువులు, ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో గత నెలకుగాను టోకు ద్రవ్యోల్బణం మూడున్నరేండ్ల కనిష్ఠ స్థాయి 0.16 శాతానికి పడిపోయింది. గురువారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ఈ విషయం వెల్లడైంది. జూన్ 2016లో నమోదైన 0.1 శాతం స్థాయికి జారుకున్నది. గతేడాది ఇదే నెలలో 5.4 శాతంగా నమోదైన టోకు ధరల సూచీ.. సెప్టెంబర్ నెలలోనూ 0.33 శాతంగా ఉన్నది. ఆహార పదార్థాల ధరల సూచీ 9.80 శాతంగా నమోదవగా, ఆహార పదార్థాలేతర ధరల సూచీ 2.35 శాతంగా నమోదైనట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాదిన్నర గరిష్ఠ స్థాయికి చేరుకోగా..టోకు సూచీ మాత్రం తగ్గుముఖం పట్టడం విశేషం. బంగాళాదుంప ధరలు ప్రతికూల జోన్ 19.60 శాతం స్థాయిలో కొనసాగుతుండగా..కూరగాయల ధరలు మాత్రం 19.43 శాతం నుంచి 38.91 శాతానికి ఎగబాకాయి.

137
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles